- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ విషయాన్ని స్ప్రెడ్ చేయండి..
దిశ, సినిమా : బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఖాన్ కొవిడ్ కారణంగా వితంతువులుగా మారిన మహిళలకు సపోర్ట్‌గా నిలవాలని పిలుపునిస్తోంది. కరోనాతో జీవిత భాగస్వామిని కోల్పోయిన వారి బాధ వర్ణించలేమని, ఇలాంటి పరిస్థితుల్లో వారికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో కొవిడ్ విడోస్.ఇన్ (covidwidows.in) వెబ్‌సైట్ గురించి తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేసిన కరీనా.. తమ పార్ట్‌నర్‌ను కోల్పోయి కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేని మహిళల ఎంప్లాయిమెంట్ కోసం యుధ్‌వీర్ టీమ్ కృషి చేస్తోందని తెలిపింది. అవసరమున్న వారు ఈ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పింది. అంతేకాదు డిప్రెషన్‌లో ఉన్న బాధిత మహిళలకు ఎక్స్‌పర్ట్స్‌చే కౌన్సిలింగ్ ఇప్పిస్తారని వివరించింది. దయచేసి ఈ విషయాన్ని స్ప్రెడ్ చేయాలన్న కరీనా.. ఎవరైనా సరే ఈ ఇనిషియేటివ్‌కు సపోర్ట్ చేస్తూ వాలంటీర్‌గా ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేయొచ్చని సూచించింది.