- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరీనా కోడలి ఫ్యామిలీ ట్రీ
కరీనా కపూర్ ఖాన్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఫ్యామిలీకి ఎంటర్ అయింది. అభిమానులతో ప్రతీ విషయాన్ని షేర్ చేసుకునేందుకు సోషల్ మీడియాలోకి విచ్చేసిన ఈ టాలెంటెడ్ హీరోయిన్.. ఫ్యాన్స్‌కు ‘డే టు డే అప్ డేట్స్’ ఇస్తూ లాక్‌డౌన్‌లో రోజంతా తానేం చేస్తుందో అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది కరీనా. కునాల్ కెమ్ము, సోహా అలీఖాన్‌ల గారాల పట్టి, తన కోడలు ఇనయా గీసిన బ్యూటీఫుల్ పిక్చర్‌ను షేర్ చేసింది.
‘మై ఫ్యామిలీ ట్రీ’ అంటూ ఒక పెయింటింగ్ వేసిన ఇనయా.. అందులో జనరేషన్స్ వారీగా ఫొటోలను పెట్టింది. తైమూర్ అలీఖాన్, సారా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్‌లతోపాటు ప్రజెంట్ జనరేషన్‌లో తన ఫొటో పెట్టుకున్న ఇనయా.. అంతకుముందు జనరేషన్‌లో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్, సోహా అలీఖాన్, కునాల్ కెమ్ము ఫొటోస్ పెట్టింది. దీంతో ‘నా అందమైన కోడలు’ అంటూ మై ఫ్యామిలీ ట్రీ పిక్చర్ గురించి వివరిస్తున్న ఇనయా ఫొటో షేర్ చేసింది కరీనా. ఈ ఫ్యామిలీ ట్రీలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. సైఫ్ కరీనాను రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
https://www.instagram.com/p/CA-v_oopCnl/?utm_source=ig_web_copy_link