సైఫ్ ఎడిటర్.. కరీనానే!

by  |
సైఫ్ ఎడిటర్.. కరీనానే!
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్‌కు ఓ బిడ్డ పుట్టాక కూడా ఏ మాత్రం క్రేజ్ దక్కలేదు. ఈ మధ్యే రెండో ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్ అయిందని తెలిపిన భామ.. త్వరలోనే షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. అమీర్ ఖాన్ హీరోగా వస్తున్న ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్న బెబో.. అమీర్ టర్కీ షెడ్యూల్ కంప్లీట్ కాగానే, ముంబైలో జరిగే నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్‌లో పాల్గొంటుందని సమాచారం. ఈ చిత్రీకరణలో చాలా కొద్ది మంది మాత్రమే పాల్గొనాలని డైరెక్టర్‌ను కోరారట అమీర్.

ఇదిలా ఉంటే, కరీనా భర్త సైఫ్ అలీ ఖాన్.. తన ఆటోబయోగ్రఫీ రాయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 2021లో రిలీజ్ చేయనున్న ఈ పుస్తకం గురించి అభిమానులు కూడా చాలా ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. కాగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించిన కరీనా.. సైఫ్ పుస్తకం రాశాక, ఆ బుక్ తనే ఎడిట్ చేస్తానని చెప్పానని తెలిపింది. తన పుస్తకం రాజకీయంగా సరైందిగా ఉండాలనేదే తన ఉద్దేశ్యం అన్నారు. తను ఏం చెప్పబోతున్నాడో తెలుసుకునేందుకు తన ముందే పుస్తకం ఎడిట్ చేస్తానని తెలిపిందట కరీనా.

కాగా సైఫ్ ప్రస్తుతం ‘బంటీ ఔర్ బబ్లీ, బూత్ పోలీస్’ సినిమాలతో పాటు ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాలో నెగెటివ్ రోల్ ప్లే చేయబోతున్నాడు. లంకాధీషుడు రావణాసురుడిగా కనిపించబోతున్నాడు.


Next Story

Most Viewed