- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: రూ.6 కోట్ల విలువైన బంగారం పట్టివేత
దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల వేళ రాష్ట్రంలో భారీగా డబ్బు, బంగారం, మద్యం లభ్యమవుతోంది. ఓటర్లను పసన్నం చేసుకునేందుకే తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో ఏదో ఒక ప్రతి రోజు పోలీసులు గుర్తిస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో భారీగా బంగారం లభ్యమైంది. చెన్నై నుంచి విజయనగరం తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. రూ.6 కోట్ల విలువైన 10 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బీబీసీ లాజిస్టిక్స్ పేరుతో తరలిస్తుండగా తనిఖీలు చేసి గుర్తించారు. ఆర్వో నుంచి అనుమతి లేకపోవడంతో బంగారాన్ని సీట్ చేశారు. డెంకాడ మండలం మోదవలసలో ఈ ఘటన జరిగింది. పట్టుకున్న బంగారాన్ని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్బంగా పోలీసులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్నారు. బంగారం, డబ్బులు తరలించాలంటే అనుమతి తప్పనిసరి అని చెప్పారు. సరైన పత్రాలు చూపించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.