- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొచ్చెర వాటర్ ఫాల్ వద్ద షూటింగ్
దిశ, బోథ్ : మండల పరిధిలో శుక్రవారం ఉదయం అర్బన్ పార్క్, సాయంత్రం పొచ్చెర వాటర్ ఫాల్ లో బుల్లెట్ రెడ్డి సినిమా షూటింగ్ ను చిత్రీకరించారు. హీరో, దర్శకుడు, నిర్మాత ఆదిరెడ్డి, హీరోయిన్ అవికతో కలిసి పాట చిత్రీకరణ చేశారు. ఈ సందర్భంగా హీరో ఆది రెడ్డి మాట్లాడుతూ సినిమా మొత్తం తెలంగాణ జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
ఇక్కడి జలపాతాలు కనువిందుగా ఉన్నాయని, రెండు రోజులు పాట చిత్రీకరణ ఉంటుందని తెలిపారు. హీరో ఆదిరెడ్డిది నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంతం కావడం విశేషం. ఈ సినిమాను ఐదు కోట్ల రూపాయలతో పూర్తి చేసి ఉగాదిలోపు విడుదల చేస్తామన్నారు. సాయంత్రం వాటర్ ఫాల్ దగ్గర సినిమా షూటింగ్ జరుగుతుందని తెలియడంతో పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఈ సినిమా చిత్ర యూనిట్ కు అటవీశాఖ, స్థానిక పోలీసులు సెక్యూరిటీని కల్పించారు.