విద్యుదాఘాతంతో బాలుడు మృతి

by Sridhar Babu |
విద్యుదాఘాతంతో బాలుడు మృతి
X

దిశ,ఉప్పల్ : కరెంట్ షాక్ కొట్టి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కర్నూల్ కి చెందిన షంషుద్దీన్(13) బోడుప్పల్ లోని వెంకటేశ్వర కాలనీలో ఉండే షేక్ మహుమ్ముద్ పాషా ఇంటికి వచ్చాడు. అనంతరం షేక్ మహుమ్ముద్ పాషా కుమారుడు అన్వర్ పాషాతో శంషుద్దీన్ ఫ్లెక్సీ కట్టడానికి ఉప్పల్ ఏషియన్ థియేటర్ ప్రాంతంలోని నెక్స్ట్ జెన్ మెడికల్ కోడింగ్ ఇస్టిట్యూట్ కి సంబంధించిన ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ వైరు తాకి షాక్ తో శంషుద్దీన్ కిందపడిపోయాడు. దాంతో స్థానికులు దగ్గర్లోని హాస్పిటల్కు తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుని తండ్రి షేక్ నబి రసూల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed