Deepika Padukone: స్పెషల్ రోల్‌లో దీపికా పదుకొనె.. ‘కల్కి’ లాగా ఈసారి కూడా హిట్ పక్కా!

by sudharani |   ( Updated:2024-12-27 16:07:46.0  )
Deepika Padukone: స్పెషల్ రోల్‌లో దీపికా పదుకొనె.. ‘కల్కి’ లాగా ఈసారి కూడా హిట్ పక్కా!
X

దిశ, సినిమా: దీపికా పదుకొనె (Deepika Padukone) ప్రజెంట్ మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తుంది. గతేడాది షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) ‘పఠాన్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందు ఈ హీరోయిన్.. ఈ ఏడాది ప్రభాస్ (Prabhas) ‘కల్కి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రెగ్నెంట్ (pregnant) అయినప్పటికీ ‘కల్కి’ ప్రమోషన్స్‌‌లో యాక్టీవ్‌గా పాల్గొంటూ అందరి దృష్టిని ఆకర్షించింది. ‘కల్కి’ చిత్రంలో దీపికా పదుకొనె ఓ స్పెషల్ రోల్‌ (Special Roll)లో నటించి మంచి మార్కులు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో సినిమాలో స్పెషల్ రోల్ చేసేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), అలియా భట్ (Alia Bhatt) ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో ప్రేమికులుగా కనిపించి మెప్పించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు జంట ‘లవ్ అండ్ వార్’ (Love and War) చిత్రంతో మరోసారి జతకట్టేందుకు సిద్ధమవుతున్నారు. సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విక్కీ కౌశల్ (Vicky Kaushal) కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాలో దీపికా పదుకొనె కూడా ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. లవ్ అండ్ వార్ చిత్రం దీపిక ఓ స్పెషల్ పాత్రలో అలరించనుందని తెలుస్తోంది. అంతే కాకుండా.. ఈ చిత్రానికి ఆమె రోల్ ప్రధాన ఆకర్షణగా కనిపించనుందని తెలుస్తుండగా.. దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (Official Announcement) రానున్నట్లు సమాచారం. కాగా.. ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. వచ్చే ఏడాది క్రిస్మస్‌ (Christmas)కు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తు్న్నారు చిత్ర బృందం.

Read More ...

Bloody sweet blood.. మరో ఇంట్రెస్టింగ్ ఫొటో షేర్ చేసిన అనుష్క


Advertisement

Next Story

Most Viewed