ఆదిలాబాద్‌లో ప్రశాంతంగా ముగిసిన నామినేషన్‌ల పరిశీలన.. 15 నామినేషన్‌ల తిరస్కరణ

by Disha Web Desk 23 |
ఆదిలాబాద్‌లో  ప్రశాంతంగా ముగిసిన  నామినేషన్‌ల పరిశీలన.. 15 నామినేషన్‌ల తిరస్కరణ
X

దిశ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ ఛాంబర్‌లో ఎన్నికల సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్‌తో కలిసి జిల్లా రిటర్నింగ్‌ అధికారి రాజర్షి షా నామినేషన్లను పరిశీలించారు. నామినేషన్లను దాఖలు చేసిన అభ్యర్థులు, వారి ఎజెంట్ల సమక్షంలో ఈ ప్రక్రియ కొనసాగింది. బీజేపీ అభ్యర్థిగా దాఖలు చేసిన మాజీ ఎంపీ రమేష్‌ రాథోడ్‌తో సహా పది మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. మరో 13 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు. మొత్తం దాఖలైన 42 నామినేషన్లలో 27 నామినేషన్లు ఆమోదించగా 15 నామపత్రాలను తిరస్కరించారు.

ఆమోదం పొందిన నామినేషన్లలో మాలోతు శ్యామ్‌లాల్‌ నాయక్‌ ( అలయ¯Œ్స ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్‌స్‌ పార్టీ), రాథోడ్‌ సుబాష్‌ ( ఇండిపెండెంట్‌), ఆత్రం సుగుణ( ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ), మెస్రం గంగాదేవి( ధర్మ సమాజ్‌ పార్టీ), ఆత్రం సక్కు(భారత రాష్ట్ర సమితి), గేడం సాగర్‌ (ఇండియా ప్రజాబంధు పార్టీ ), గోడం నగేష్‌(భారతీయ జనతా పార్టీ), కొడప వామన్‌ రావు ( గొండ్వానా దండకారణ్య పార్టీ), భుక్యా జైవంత్‌ రావు( స్వతంత్ర అభ్యర్థి), నునావత్‌ తిరుపతి (విద్యార్థుల రాజకీయ పార్టీ), రాథోడ్‌ రాజు( స్వతంత్ర అభ్యర్థి), చవాన్‌ సుదర్శన్‌ (అన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ), జంగు బాపూ మెస్రం (బహుజన్‌ సమాజ్‌ పార్టీ)ల నామినేషన్లు ఆమోదం పొందాయి.తిరస్కరణకు గురైనా నామినేషన్ల లో చవాన్‌ రామ్‌( ఇండిపెండెంట్‌), రాథోడ్‌ రమేష్‌ (భారతీయ జనతా పార్టీ), నేతావత్‌ రాందాస్‌ (ఇండిపెండెంట్‌), కుమ్రం మాంతయ్య (ఇండిపెండెంట్‌), పెందూరు సుధాకర్‌ (ఇండిపెండెంట్‌), ధరావత్‌ నరేంధర్‌ (బీఆర్‌ఎస్‌), ఆత్రం భాస్కర్‌ (ఐఎన్‌సీ), నైతం రవీందర్‌ (ఇండిపెండెంట్‌), మడావి వెంకట్‌ రావు (రాష్టీయ్ర మానవ్‌ పార్టీ), ఆత్రం భీంరావు (ఇండిపెండెంట్‌ )ల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. కాగా ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. ఎంత మంది ఎన్నికల బరిలో ఉంటారనేదీ ఉపసంహరణల ప్రక్రియ అనంతరం తేలనుంది.ఇందులో ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, అడిషనల్‌ కలెక్టర్‌ శ్యామాల దేవి, ఆర్డీఓ వినోద్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed