నల్గొండ పార్లమెంట్ స్థానానికి 56 నామినేషన్లు

by Disha Web Desk 11 |
నల్గొండ పార్లమెంట్ స్థానానికి 56 నామినేషన్లు
X

దిశ, నల్లగొండ: నల్గొండ పార్లమెంట్ స్థానానికి మొత్తం 56 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా, నామినేషన్ల పరిశీలన అనంతరం 25 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురి అయ్యాయి. కాగా 31 మంది అభ్యర్థుల నామినేషన్లు అంగీకరించడం జరిగింది. అంగీకరించిన నామినేషన్ల అభ్యర్థుల వివరాలు శానంపూడి సైదిరెడ్డి, కుందూరు రఘువీరా రెడ్డి, కంచర్ల క్రిష్ణా రెడ్డి, విరుగునేని అంజయ్య, బండారు నాగరాజు, చోల్లోటి ప్రభాకర్, గోలి సైదులు,నందిపటి జానయ్య, కిన్నెర యాదయ్య, కుక్కల వెంకన్న, కుందరపు శ్రీకాంత్, లింగాల శ్రీనివాస్, లింగం కృష్ణ,మారం వెంకట్ రెడ్డి, మర్రి నిహ్మయ్య, నుకాల నరసింహ్మ రెడ్డి, పనుగోటి లాల్ సింగ్, పొలిశెట్టి వెంకటేశ్వర్లు, పోతుల ప్రార్ధన, పోతుల యాదగిరి, రాచ సుభద్ర రెడ్డి, పాలకురి రమాదేవి, సుంకర రమేష్, పాలకురి రవి, షైక్ ఉస్మాన్ బాబా, శిరిశాల శీనయ్య, సోమగాని నరేందర్, తలారి రాం బాబు, తండు ఉపేందర్, తిరుగుడు రవి కుమార్, వాస్కుల మట్టయ్య అభ్యర్థుల నామినేషన్లు అంగీకరించబడింది అని అధికారులు తెలిపారు.



Next Story

Most Viewed