జర చూసి రారా అందగాడా అప్పుల్లో ఉన్నా... ఆటో వెనుక కోట్స్ వైరల్.. ఒక్కో కామెంట్ ఆణిముత్యం..

by Dishafeatures3 |
జర చూసి రారా అందగాడా అప్పుల్లో ఉన్నా... ఆటో వెనుక కోట్స్ వైరల్.. ఒక్కో కామెంట్ ఆణిముత్యం..
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా ఆటో, లారీ, ట్రక్కుల వెనుక చాలా కోట్స్ రాసుకుంటారు. 'అతివేగం హానికరం ', ' అమ్మ దీవెన ', ' నాన్న బహుమతి ' అని చూసుంటాం. లేదంటే సినిమాల పేర్లు, హీరోహీరోయిన్ల ఫొటోలు కూడా పెట్టడం కామన్. కానీ కొంత మంది సరికొత్తగా ఆలోచిస్తారు. వైరల్ అయిపోయేంత యూనిక్ కాన్సెప్ట్ తో అదరగొడుతారు. ఈ కోవలోకి చెందినదే ' జర చూసి రారా అందగాడా అప్పుల్లో ఉన్నా ' అనే కొటేషన్.

ఓ ట్రక్ మీద రాసిన ఈ లైన్స్ ప్రస్తుతం ట్రెండ్ అవుతుండగా.. నెటిజన్ల రియాక్షన్ ఇంకా ఫన్నీగా ఉంది. 'అందగాడా అంటే అంధగాడా అని కావచ్చు ఆయన ఉద్దేశం.. కళ్లు మూసుకుని కాకుండా సక్కగా డ్రైవ్ చేయమని అయి ఉంటుంది ' , ' వాట్ ఏ విజన్, వాట్ ఏ థాట్, పిచ్చోల్లు అయిపోయారు మా టీమ్ అంతా ' , ' మీరు అంత ఫీల్ అయిపోవద్దు.. ఇండైరెక్ట్ గా తిడుతున్నాడు' అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఒక్కో కామెంట్స్ ఒక్కో అణిముత్యం కాగా మీరు ఓసారి లుక్ వేయండి.

Next Story

Most Viewed