ప్రజలు నమ్మకాన్ని కోల్పోతారు.. బెంగాల్ జాబ్స్ స్కాంలో సుప్రీం కీలకవ్యాఖ్యలు

by Dishanational6 |
ప్రజలు నమ్మకాన్ని కోల్పోతారు.. బెంగాల్ జాబ్స్ స్కాంలో సుప్రీం కీలకవ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: బెంగాల్ టీచ‌ర్స్ రిక్రూట్మెంట్ స్కాం కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 25 వేల మంది ఉద్యోగులను తొలగించాలని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. కలకత్తా హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ బెంగాల్ ప్రభుత్వం సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. దీనిపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. టీచర్ల నియామక ప్రక్రియను తప్పుపట్టింది. వెయింట్ లిస్టులో ఉన్నవారిని ఎందుకు రిక్రూట్ చేశారని ప్రశ్నించింది.

ఉద్యోగాల‌ను ర‌ద్దు చేసే అధికారం హైకోర్టుకు లేద‌ని సీనియ‌ర్ న్యాయ‌వాది జైదీప్ గుప్తా వాదించారు. దీంతో సీజేఐ బెంగాల్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షంకురిపించారు. రిక్రూట్ మెంట్ అభ్యర్థులకు సంబంధించిన ఓఎంఆర్ షీట్లు ఉన్నాయని అని అడిగారు. ఇంత సున్నితమైన అంశంలో టెండర్ ఎందుకు జారీ చేయలేదని ప్రశ్నించారు. డిజిటల్ కాపీలను భద్రపరచడం కమిషన్ బాధ్యత అని గుర్తుచేశారు. పరీక్షలకు సంబంధించిన డిజిటల్ డేటా సీబీఐకి కూడా దొరకలేదని తెలిపారు. టీచర్ల నియామకంలో వ్యవస్థాగత మోసం జరిగిందని సీజేఐ పేర్కొన్నారు. ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఉండేది తక్కువ అని.. ఇక ఆ అపాయింట్ మెంట్లను కూడా మలినం చేస్తే వ్యవస్థ ఎలా నడుస్తుందని ప్రశ్నించారు. ప్రజలకు వ్యవస్థపైన నమ్మకం పోతుందని అన్నారు. ప్రజలు నమ్మకాన్ని కోల్పోతారని అన్నారు. మీరు దీన్ని ఎలా సహిస్తారని బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

కలకత్తా హైకోర్టు ఏప్రిల్ 22న ఇచ్చిన తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, లిస్టింగ్ తర్వాతి తేదీ వరకు సూపర్-న్యూమరిక్ పోస్టుల సృష్టికి ఆమోదం తెలిపిన అధికారులపై సీబీఐ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోరాదని ఆదేశించింది.

Next Story

Most Viewed