శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మరో అవకాశం.. సెకండ్ చాన్స్ ఇచ్చిన బీసీసీఐ

by Harish |   ( Updated:2024-05-19 13:06:13.0  )
శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మరో అవకాశం.. సెకండ్ చాన్స్ ఇచ్చిన బీసీసీఐ
X

దిశ, స్పోర్ట్స్ : దేశవాళీ క్రికెట్‌కు దూరంగా ఉన్న కారణంగా టీమ్ ఇండియా యువ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే, సెంట్రల్ కాంట్రాక్ట్‌తోపాటు జాతీయ జట్టులోకి తిరిగి చోటు సంపాదించడానికి వారికి బీసీసీఐ మరో అవకాశం ఇచ్చింది. 2024-25 దేశవాళీ సీజన్‌కు సంబంధించి ఎన్‌సీఏ హై ఫర్పామెన్స్ మానిటరింగ్ ప్రొగ్రామ్‌ కోసం సెలెక్టర్లు 30 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు.

అందులో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌‌లు కూడా ఉన్నారు. ‘అయ్యర్, కిషన్‌లకు బీసీసీఐ వ్యతిరేకం కాదు. రాబోయే దేశవాళీ సీజన్‌లో వారు తమ రాష్ట్రాల జట్ల తరపున సత్తాచాటితే సెంట్రల్ కాంట్రాక్ట్ తిరిగి పొందే అవకాశం ఉంది. జాతీయ జట్టులో కూడా చోటు దక్కొచ్చు. వారు సెలెక్టర్ల రాడార్‌లో ఉన్నారని చెప్పడానికి ఇది సంకేతం.’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. సెంట్రల్ కాంట్రాక్ట్‌లో లోని నిలకడగా రాణిస్తున్న వారిని ఎంపిక చేశారు. ముషీర్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, పృథ్వీ షా, సాయి సుదర్శన్, సాయి కిశోర్, మయాంక్ యాదవ్, కుల్దీప్ సేన్, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే, రియాన్ పరాగ్, అశుతోష్ శర్మతోసహా పలువురు ఉన్నారు. ఎన్‌సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో దాదాపు నెలరోజులపాటు క్యాంప్ నిర్వహించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed