- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘తమాషా’గా కరీనా పెళ్లి!
బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ అందానికి కేరాఫ్ అడ్రస్. నటనకు ప్రాణం పోస్తే ఇలా ఉంటుందా అన్నట్లు చేస్తుంది యాక్టింగ్. సీనియర్ హీరో సైఫ్ అలీఖాన్‌ను పెళ్లి చేసుకుని చక్కగా సెటిల్ అయిపోయిన ఈ బ్యూటీ.. పెళ్లి తర్వాత కూడా కెరియర్‌ను సాఫీగా సాగిస్తోంది. లీడ్ రోల్స్ చేస్తూ హుషార్‌గా లైఫ్ లీడ్ చేస్తుంది. అయితే ఒకప్పుడు షాహిద్ కపూర్‌తో ప్రేమలో ఉన్న కరీనా.. అసలు తన నుంచి ఎందుకు విడిపోయింది? సైఫ్‌ను ఎందుకు పెళ్లి చేసుకుంది? అన్న విషయాలపై నోరు విప్పింది.
‘జబ్ వి మెట్’ సినిమాతో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న షాహిద్, కరీనాలు ఆ సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారట. ముందుగా ఆ సినిమా స్క్రిప్ట్ విన్న షాహిద్… మూవీలో అమ్మాయి క్యారెక్టర్ చాలా బాగుందని .. నువ్వు చేస్తే బాగుంటుందని రిఫర్ చేశాడట. దీంతో ఆ సినిమా చేయాల్సి వచ్చిందట. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడిందట. ఈ సినిమా తన కెరియర్‌కు టర్నింగ్ పాయింట్ ఇచ్చిందని తెలిపింది.
కానీ ‘తషాన్’ సినిమా నా లైఫ్‌కు టర్నింగ్ పాయింట్ అని తెలిపింది కరీనా. ఆ టైంలోనే సైఫ్‌ను కలిశానని… తాను ఊహించుకున్న కలల రాకుమాడు సైఫే అని ఫిక్స్ అయ్యానని తెలిపింది. తర్వాత తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, తన జీవితంలో జరిగిన ప్రేమ, పెళ్లి ముచ్చట్లను ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది.