- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కపిల్ లవ్ ఎలా ప్రపోజ్ చేశాడో తెలుసా?
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ ఇటీవలే గుండెపోటు రావడంతో చికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇండియాకు తొలి ప్రపంచ కప్ అందించిన కపిల్ తన జీవితంలోకి భార్య రోమి ఎలా ప్రవేశించిందో వెల్లడించాడు. ఒక రోజు రోమి భాటియా, కపిల్ ఒక కారులో ప్రయాణిస్తున్నారు. దారిలో కపిల్ ఫొటో ఉన్న అమూల్ యాడ్ కనిపించింది. వెంటనే ఆ హోర్డింగ్ ఫొటో తీయమని రోమికి కపిల్ చెప్పారంటా. ఎందుకు అని రోమి ప్రశ్నించగా.. భవిష్యత్తులో మన పిల్లలకు చూపిద్దామని జవాబిచ్చాడట. వెంటనే రోమీ.. ఏంటీ నాకు ప్రపోజ్ చేస్తున్నావా అని ప్రశ్నించగా.. అవును అని కపిల్ సమాధానం చెప్పాడు. వెంటనే రోమీ కూడా కపిల్ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వరల్డ్ కప్ సాధించడానికి మూడేళ్ల ముందే వీరిద్దరికి పెళ్లి జరిగిపోయింది. పెళ్లికి ఇరువురి తల్లిదండ్రులు ఒప్పుకున్నా.. రోమి వాళ్ల తాతయ్య మాత్రం పలు ప్రశ్నలు సంధించి చివరకు ఒప్పుకున్నాడట.