అత్యాధునిక వైద్య సేవలు అందించడమే లక్ష్యం

by Shyam |
Kantem Ravi Kiran Hospital
X

దిశ, నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో మొట్టమొదటి ఆర్థోపెడిక్ వైద్యుడిగా కంటెం రవికిరణ్ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా.. రవి కిరణ్ ఆసుపత్రి నేటితో 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని 19వ వసంతంలోకి అడుగిడింది. ఈ సందర్భంగా ఆసుపత్రిలో సీఎంఏఆర్ మెషీన్‌తో సాంకేతిక పరిజ్జానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు రవికిరణ్ తెలిపారు. ఈ పరిజ్ఞానం ద్వారా ఎముక విరిగిన ప్రదేశాన్ని ఖచ్చితత్వంతో గుర్తించడంలో, తక్కువ సమయంలోనే కోలుకునేలా శస్త్ర చికిత్స చేయడంలో దోహదపడుతుందన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రవి కిరణ్ స్పష్టం చేశారు. నర్సంపేటలో మొట్టమొదటి ఆర్థోపెడిక్ వైద్యునిగా సేవలు మొదలుపెట్టి నేటికీ నామ మాత్రపు ఫీజుతోనే సేవలందిస్తున్నట్లు తెలిపారు. గడచిన 18 ఏండ్లుగా సామాన్య ప్రజలకు మంచి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చులో అందిస్తూ పేదల పాలిట ఆత్మబంధువుగా నిలిచిన రవి కిరణ్‌ను అందరూ అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed