సీఎం గారూ శ్వేతపత్రం విడుదల చేయండి: కన్నా లేఖ

by srinivas |   ( Updated:2020-04-17 07:26:44.0  )
సీఎం గారూ శ్వేతపత్రం విడుదల చేయండి: కన్నా లేఖ
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి, కేసుల సంఖ్య, వైద్య పరీక్షల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కరోనా కేసులపై ప్రభుత్వం వాస్తవాలు దాస్తోందన్న విపక్షాల ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ బహిరంగ లేఖ రాయడం విశేషం. ఇంకా ఆ లేఖలో ఏమన్నారంటే…

ప్రభుత్వ వైఖరి వల్ల ప్రజలకు అనేక అనుమానాలు వస్తున్నాయని తెలిపారు. వారి అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్ని టెస్టింగ్ కిట్స్ అందుబాటులో ఉన్నాయో, క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాల సమాచారంతో పాటు, ఇప్పటి వరకు పరీక్షలు నిర్వహించిన లెక్కలు చెప్పాలని కోరారు.

వాటితో పాటు ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో నిర్వహించిన తబ్లీఘీ మర్కజ్‌కు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంత మంది వెళ్లారని, వారిలో ఎంతమందికి కరోనా పరీక్షలు నిర్వహించారని, ఎంతమందికి సోకింది? మరెంతమంది చికిత్స పొందుతున్నారు? ఇంకెంతమంది డిశ్చార్జ్ అయ్యారు వంటి వివరాలతో కూడిన శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

tags:kanna lakshminarayana, ap, ysrcp, ap cm, bjp, kanna, open letter,

Advertisement

Next Story