కంగనా వర్సెస్ ఆదిత్య.. మాటల యుద్ధం!

by Shyam |
కంగనా వర్సెస్ ఆదిత్య.. మాటల యుద్ధం!
X

సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో.. బాలీవుడ్‌లోని చాలామంది ప్రముఖులపై ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగనా ఫైర్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు మంత్రి ఆదిత్య ఠాక్రేపై కూడా సంచలన ఆరోపణలు చేసింది. సుశాంత్ మ‌ర‌ణించే ముందు రోజు ఆదిత్య ఠాక్రే అక్క‌డే ఉన్నాడ‌ని, వారు క‌లిసి పార్టీ చేసుకున్నార‌ని, ఈ విష‌యం అంద‌రికీ తెలిసినా, ఎవ‌రూ చెప్పరు అంటూ ఘాటుగా విమర్శించింది. అంతేకాదు, సుశాంత్ కేసులో ఆదిత్య ఠాక్రే ప్రమేయం ఉందన్న వార్తలపై ఎందుకు మౌనం పాటిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. కాగా, దీనిపై ఆదిత్యా ఠాక్రే స్పందించారు.

సుశాంత్ మరణానికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఆదిత్య స్పష్టం చేశారు. బాలీవుడ్‌లో చాలా మందితో పరిచయాలు ఉన్నాయని, అంతమాత్రాన.. నేరం చేసినట్లు కాదు కదా! అంటూ కంగనా విమర్శలకు బదులిచ్చారు. తన కుటుంబానికి, మహారాష్ట్రకు, పార్టీకి కళంకం తెచ్చే పనులు చేయనని, ఒకరి మరణాన్ని రాజకీయ లాభాల కోసం ఉపయోగించినందుకు ఆయన ప్రతిపక్షాలను నిందించాడు. ఈ మేరకు ప్రతిపక్షాలు ‘మురికి రాజకీయాలు’ చేస్తున్నాయని విమర్శించాడు.

ఆదిత్యఠాక్రే ‘మురికి రాజకీయాలు’ అన్న వ్యాఖ్యలపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ స్పందించారు. మురికి రాజకీయాల గురించి మీరా స్పందించేది? మీ తండ్రికి సీఎం సీటు ఎలా వచ్చింది? సుశాంత్ మరణానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పమని మీ తండ్రిని ఈ ప్రశ్నలు అడగండి’ అంటూ ఫైర్ అయ్యింది.

1) సుశాంత్ ప్రియురాలు రియా ఎక్కడ ఉంది?
2) సుశాంత్ అసహజ మరణంపై ముంబై పోలీసులు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు?
3) ఫిబ్రవరి నెలలో సుశాంత్ జీవితం ప్రమాదంలో ఉందని ఫిర్యాదు చేసినప్పుడు ముంబై పోలీసులు దీనిని మొదటి రోజు ‘ఆత్మహత్య’ అని ఎందుకన్నారు?
4) హత్య జరిగిన వారంలో అందరినీ పిలిచి మాట్లాడిన ఫోరెన్సిక్ నిపుణులు.. సుశాంత్ ఫోన్ డేటాను ఎందుకు తీసుకోలేదు. ఆ డేటా ఎందుకు మిస్ అయ్యింది?
5) ఐపీఎస్ వినయ్ తివారీని దిగ్బంధం పేరిట ఎందుకు లాక్ చేశారు?
6) సీబీఐకి కేసు అప్పగించడానికి ఎందుకు భయపడుతున్నారు?
7) రియా, ఆమె కుటుంబం సుశాంత్ డబ్బును ఎందుకు దోచుకున్నారు?

‘ఈ ప్రశ్నలకు రాజకీయాలతో సంబంధం లేదు.. దయచేసి వీటికి సమాధానం ఇవ్వండి’ అని కంగనా ఆదిత్యా ఠాక్రేను ప్రశ్నించారు.

Advertisement

Next Story