హోంమంత్రిపై కంగనా హాట్ కామెంట్స్ …

by Anukaran |   ( Updated:2021-04-05 07:01:52.0  )
హోంమంత్రిపై  కంగనా హాట్ కామెంట్స్ …
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశముఖ్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గతకొంత కాలంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన నైతిక బాధ్యతను వహిస్తూ సోమవారం పదవికి రాజీనామా చేశారు. ఇక ఈ విషయమై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. “స్త్రీలను వేధించి, హింసించేవారికి ఎప్పటికైనా పతనం తప్పదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే.. ముందు ముందు భవిష్యత్తులో చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది” ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట సంచలాన్ని సృష్టిస్తున్నాయి. గతంలో కంగనాకు, మహారాష్ట్ర ప్రభుత్వానికి చిన్నపాటి యుద్ధమే జరిగిన విషయం తెల్సిందే.

కంగనా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరుస్తూ మాట్లాడడం, అనిల్ దేశ్ ముఖ్ కంగనా ముంబైలో ఉండడానికి వీల్లేదని ఆమె ఇంటిని కూల్చివేయడం అప్పట్లో పెను సంచలనంగా మారింది. అయితే అప్పుడు కంగనా ఈరోజు నా ఇల్లును కూల్చి వేసి ఉండొచ్చు .. కానీ ఏదో ఒక రోజు మీ అహంకారం అణిగి పోతుంది అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్స్ ని నెటిజన్లు ఇప్పుడు వెలికి తీసి అనిల్ దేశ్ ముఖ్, ఉద్దవ్ ఠాక్రే పేర్లను జోడించి రీట్వీట్స్ పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed