- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిరూపించకపోతే.. పద్మశ్రీ వెనక్కిచ్చేస్తా: కంగనా
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించింది. ఇన్‌సైడర్స్, ఔట్‌సైడర్స్ అంటూ.. హిందీ సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం పాతుకుపోయిందని, అదే సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు కారణమని బల్లగుద్ది చెప్తోంది కంగనా రనౌత్.
జూన్ 14న సుశాంత్ మరణం తర్వాత పలు వీడియోలు రిలీజ్ చేసిన కంగనా.. ముమ్మాటికి ఇది నెపోటిజం వల్లే జరిగిందని చెప్పింది. మహేశ్ భట్, కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్ లాంటి పలువురు ప్రముఖులు వారసత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించింది. బయట నుంచి వచ్చిన సుశాంత్ లాంటి నటులకు టాలెంట్ ఉన్నా సరే అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని.. ఆ సమయంలో నటులు ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటారో తెలిపింది. మరో వైపు కొన్ని మీడియా సంస్థలు నెపోటిజానికి సపోర్ట్ ఇస్తూ.. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఎదుగుతున్న నటులపై ఇష్టారీతిన న్యూస్ రాస్తున్నాయని మండిపడింది. అయితే పోలీసులు తన ఆరోపణలు లైట్‌గా తీసుకుంటున్నారని.. తను చేసిన ఆరోపణలు నిరూపించకపోతే ప్రభుత్వం అందించిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటించింది.
ముంబై పోలీసులు తనకు సమన్లు జారీ చేశారని.. కానీ నేను మనాలిలో ఉన్నానని.. తన స్టేట్‌మెంట్ రికార్డ్ చేసుకునేందుకు ఎవరినైనా పంపించాలని కోరినట్లు తెలిపింది. కానీ మళ్లీ ఇంత వరకు వారి నుంచి ఎలాంటి సమాధానం అందలేదని తెలిపింది కంగనా.