సినిమా కోసం ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా : కంగన

by Jakkula Samataha |
సినిమా కోసం ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా : కంగన
X

దిశ, సినిమా : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఫిల్మ్ ‘తలైవి’. దివంగత తమిళనాడు సీఎం జయలలిత బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తుండగా, మూవీ ట్రైలర్‌ను మార్చి 23న (మంగళవారం) విడుదల చేయనున్నారు. కాగా ఈ సినిమాలో జయలలిత లుక్ కోసం కంగన చాలానే కష్టపడింది. ఆమె ఏయే వ‌య‌స్సులో ఎలా ఉందో? అలా కనిపించేందుకు నెలల వ్యవధిలోనే 20 కిలోల బరువు పెరగడంతో పాటు తగ్గడం వంటి ఎన్నో చాలెంజెస్‌ ఫేస్ చేసింది.

ఈ మేరకు తాజాగా షూటింగ్ పిక్స్ షేర్ చేసిన కంగన.. సినిమా ట్రైలర్ కోసం తాను ఎదురు చూస్తున్నానని, ‘తలైవి’ ఎపిక్ బయోపిక్ అని పేర్కొంది. అయితే కంగన ఇందులోని కొన్ని ఫొటోల్లో లావుగా, మ‌రికొన్ని ఫొటోల్లో స్లిమ్‌గా క‌నిపిస్తుండగా.. భ‌ర‌త నాట్యం చేస్తున్న ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. కాగా ‘తలైవి’ చిత్రాన్ని ఈ ఏడాది జూన్ 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed