బిగ్ బ్రేకింగ్.. SRH కెప్టెన్‌ వార్నర్ తొలగింపు.. కొత్త కెప్టెన్ అతడే..!

by Anukaran |   ( Updated:2021-05-01 05:48:49.0  )
బిగ్ బ్రేకింగ్.. SRH కెప్టెన్‌ వార్నర్ తొలగింపు.. కొత్త కెప్టెన్ అతడే..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ సీజన్ 14లో వరుస ఓటములతో పాయింట్ టేబుల్‌లో చివరిస్థానానికి పడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కెప్టెన్‌గా కొనసాగుతున్న డేవిడ్ వార్నర్‌ను తొలగించింది. ఆ స్థానంలో ఐపీఎల్ సీజన్ 2021 మొత్తానికి కేన్ విలియమ్సన్‌ను కెప్టెన్‌ నియమిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. రేపు రాజస్థాన్ రాయల్స్‌తో జరగబోయే మ్యాచ్‌ నుంచి కేన్ విలియమ్సన్ హైదరాబాద్‌ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. కాగా, వార్నర్ సారథ్యంతో ఈ సీజన్‌లో ఇప్పటివరకు 6 మ్యాచులు ఆడిన SRH.. కేవలం 1 మ్యాచ్‌లోనే గెలవడం గమనార్హం. ఇక హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఇప్పటి నుంచి ప్రతీ ఒక్క మ్యాచ్‌ కీలక ఘట్టమనే చెప్పాలి. ఇక డేవిడ్ వార్నర్‌పై స్పందించిన యాజమాన్యం జట్టులో ఒక ప్లేయర్‌గా అతడికి తగిన స్థానం ఉందని చెప్పింది. దీనికి సంబంధించిన ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

https://twitter.com/SunRisers/status/1388429789250211843?s=20

Advertisement

Next Story