- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కనకదుర్గా ఫ్లైఓవర్‌పై కేంద్రం ఫోకస్.. త్వరలో..
దిశ, ఏపీ బ్యూరో: ఆరు వరుసల కనకదుర్గా ఫ్లై ఓవర్ ను రోల్‌మోడల్‌గా దేశమంతా చాటాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని 4 న ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుకు అనుమతులిచ్చిన కేంద్రం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఈ ఫ్లై ఓవర్ ఇంజనీరింగ్ అద్భుతాన్ని ప్రజలకు పరిచయం చేయనున్నారు. దీని కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా డ్రోన్ బృందాన్ని విజయవాడకు పంపింది. ఈ బృందం ఫ్లైఓవర్ అందాలను చిత్రీకరించింది.
ఆర్‌అండ్‌బీ స్టేట్ హైవేస్ విభాగం అధికారులతో పాటు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. ప్రారంభోత్సవానికి ముందు దేశవ్యాప్తంగా జాతీయ మీడియాలో ఫ్లైఓవర్‌కు సంబంధించిన డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నారు. స్పైన్ అండ్ వింగ్స్ టెక్నాలజీతో ఒంటి స్తంభంపై ఆరు వరుసలతో నిర్మించిన ఫ్లై ఓవర్ కావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. ఢిల్లీ, ముంబయిలో ఈ తరహా ఫ్లై ఓవర్లున్నాయి. ఇది మూడోదయినా ఆ రెండింటి కంటే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కలిగి ఉంది. పైగా దేశంలోనే అతి పొడవైన ఫ్లైఓవర్ కావడం విశేషం.