- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లాక్ డౌన్ దిశగా కామారెడ్డి..?
దిశ, కామారెడ్డి : కరోనా మహమ్మారి రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు, అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. కరోనా మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ లో జిల్లాలో ప్రతి రోజు వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దాంతో ఇటు అధికారులు, అటు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇలాగే కొనసాగితే ప్రజలు బయటకు రావడానికి భయపడాల్సిన పరిస్థితులు జిల్లాలో నెలకొంటున్నాయి. జిల్లాలో మరోమారు లాక్ డౌన్ విధించే పరిస్థితులు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
పెరుగుతున్న కోవిడ్ కేసులు
జిల్లాలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. ప్రతిరోజు వందల సంఖ్యలో కేసులు నమోదు కావడం అందరిని ఆలోచనలో పడేస్తుంది. ప్రతి రోజు సుమారు మూడు వేల మంది కరోనా పరీక్షలు చేయించుకోవడం, అందులో 7 వందల వరకు కేసులు నమోదు అవుతుండడంతో మరోసారి లాక్ డౌన్ అంశం ప్రస్తుతం తెరపైకి తెస్తున్నారు.
ఈ నెల 19 న సమావేశం
కరోనా కేసులు పెరుగుతుండటంతో కామారెడ్డి పట్టణంలో మరోసారి కరోనా కట్టడిపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఈ నెల 19 న రాజకీయ, వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు , జెఎసి నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఆ రోజు కరోనా కట్టడిపై తీసుకునే చర్యలపై సమిష్టిగా నిర్ణయం తీసుకోనున్నారు.
సాయంత్రం 6 వరకే
ఒకవేళ సమావేశం నిర్వహించి కరోనా కట్టడిపై సమిష్టి నిర్ణయం తీసుకుంటే సమయపాలన విధించనున్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే వ్యాపార వాణిజ్య లావాదేవీలు కొనసాగేలా నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. గతంలో కరోనా మొదటి వేవ్ సమయంలో కూడా ఇదే విధానాన్ని కొనసాగించారు. ప్రస్తుతం అదే బాటలో స్వచ్ఛందంగా వ్యాపార లావాదేవీలు సాగించనున్నారు.