Additional Collector Madhuri : ధాన్యం ఖాళీ చేసిన వాహనాలను కేంద్రాలకు పంపాలి

by Aamani |   ( Updated:2024-11-05 14:56:45.0  )
Additional Collector Madhuri : ధాన్యం ఖాళీ చేసిన వాహనాలను కేంద్రాలకు పంపాలి
X

దిశ, చౌటకూర్ : రైతులను ఇబ్బంది పెట్టొద్దని, కొనుగోళ్లను వెంట వెంటనే చేపట్టాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మాధురి సూచించారు. మంగళవారం నాడు పుల్కల్ మండలంలోని వివిధ గ్రామాలలో కోడూరు, ముది మాణిక్యం, గ్రామాలలోని ఆరబెట్టిన వరి ధాన్యాన్ని, కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. దీనితో పాటు పుల్కల్,ముది మాణిక్యం గ్రామాల శివారు ప్రాంతాల్లో గల రైస్ మిళ్లను కూడా సందర్శించారు. ఆమె తెలిపారు. కాంటా చేయకుండా ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నారంటా నిర్వహకుల పై అసహనం వ్యక్తం చేశారు నిర్ణీత తేమ శాతం ఉన్న ధాన్యాన్ని వెంటనే కంటా చేసి రైస్ మిల్లుకు తరలించాలని ఆదేశించారు.

క్రమ పద్ధతిలో రైతుల పేరును నమోదు చేసి చేసుకొని ఆ మేరకు కేంద్రాల్లోనే తూకం చేయాలన్నారు. మండల కేంద్రమైన పుల్కాల్లో కేంద్రంలోని ఒకటే ఫ్యాడి మాత్రమే ఉండటంతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతుందని రైతులు అదనపు కలెక్టర్ మాధురిని దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. అకాల వర్షాలు మిల్లుల్లో ధాన్యం త్వరితగతిన ఆన్ లోడ్ చేసి వెంటవెంటనే లారీలను కేంద్రాలకు పంపాలని మిల్లుల యాజమాన్యాలను ఆదేశించారు రెవెన్యూ ,పౌరసరఫరాల, ఇతరుల శాఖల అధికారులు సామాన్యంతో పని చేసుకుని సమస్యలు లేకుండా చూడాలన్నారు. అదునకు కలెక్టర్ వెంట తాసిల్దార్ కిష్టయ్య ఆర్ఐ దావుద్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed