arrest : రూపే కార్డుల దొంగలు అరెస్ట్

by Sridhar Babu |
arrest : రూపే కార్డుల దొంగలు అరెస్ట్
X

దిశ,తల్లాడ : తల్లాడ సొసైటీలో రైతులకు చెందిన రూపే కార్డులు దొంగిలించి వారి ఖాతాలో నుంచి డబ్బులు డ్రా చేసి దుర్వినియోగం చేసిన వ్యక్తులను మంగళవారం తల్లాడ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ కొండలరావు తెలిపిన వివరాల ప్రకారం 2020 సంవత్సరంలో మల్లారం గ్రామానికి చెందిన బెల్లంకొండ చిన్న సైదులు, దుగ్గిదేవర వెంకటకృష్ణారావు తల్లాడ సొసైటీలో రైతులకు సంబంధించిన దాదాపు 740 రూపే కార్డులు దొంగిలించారు.

వారి ఖాతాల్లో నుంచి రూ.40.56 లక్షలు వివిధ ఏటీఎంలలో డ్రా చేసి డబ్బులు వాడుకున్నారు. ఈ విషయంపై అప్పుడు రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం ఖమ్మం డీసీఓ ఆదేశాల మేరకు తల్లాడ సొసైటీ సెక్రటరీ నాగబాబు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా బెల్లంకొండ చిన్న సైదులు, దుగ్గిదేవర వెంకటకృష్ణారావులపై కేసు నమోదు చేసి కస్టడీకి తరలించినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Next Story