- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కామారెడ్డి మున్సిపాలిటీ బడ్జెట్ రూ.54.81కోట్లు
దిశ, నిజామాబాద్ :
కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో మున్సిపల్ అంచనా బడ్జెట్ రూ.54.81 కోట్లను సభ్యులందరూ ఎకగ్రీవంగా ఆమోదించారు.బుధవారం పట్టణంలోని సత్య కన్వెన్షన్‌లో కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి అధ్యక్షతన సాధరణ సర్వసభ్య సమావేశం జరిగింది. దీనికి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కుమార్ ముఖ్య అథితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ..కామారెడ్డి పట్టణాన్నిఅందరి భాగస్వామ్యంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లాలోని 49 వార్డు సభ్యులు ప్రజల-సహకారంతో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తామన్నారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు నెలకు రూ.308 కోట్లు మంజూరు చేసినట్లుగానే, మున్సిపాలిటీలకు కూడా ప్రతి నెలా రూ.148 కోట్లు మంజూరు చేస్తున్నారని గుర్తు చేశారు. జిల్లా కలెక్టరు ఎ.కరత్ మాట్లాడుతూజ.. పన్నుల రూపంలో రూ.26 కోట్ల 21 లక్షలు ఆదాయం వస్తుండగా, వేతనాలు, పారిశుధ్యం నిర్వహణ, 10 శాతం గ్రీన్ బడ్జెట్ కలిపి రూ.15 కోట్ల 92 లక్షలు ఖర్చులు పోగా మిగులు బడ్జెట్ రూ.7 కోట్ల 33 లక్షలు ఉందన్నారు. ముస్సిపల్ దుకాణాల లైసెన్సులను రీ సర్వే చేసి ఆదాయ వనరులను పెంచుకోవాలని, రిజిస్ట్రేషన్లకు సంబంధించి 3 ఎల్ టాక్స్‌లు పూర్తి స్థాయిలో మున్సిపాలిటీ పొందాలన్నారు. అలాగే హోర్డింగ్స్, అడ్వర్ టైజ్ మెంట్ పన్నులను పూర్తి స్థాయిలో సమకూర్చుకోవాలని పలువురు సభ్యులు కౌన్సిల్లో సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల ఆదనపు కలెక్టరు వెంకటేశ్, ఉల్లా అసిస్టెంట్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ముప్పిపల్ వైస్ చైర్మన్ ఇందు ప్రియ, కమిషనర్ దేవేందర్, అధికారులు,కౌన్సిలర్లు పాల్గొన్నారు.