- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతి గురువారం అంగన్‌వాడీ డే నిర్వహించాలి : కలెక్టర్ శరత్
దిశ, నిజామాబాద్: అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రతి గురువారం అంగన్‌వాడీ డే నిర్వహించాలని కామారెడ్డి కలెక్టర్ శరత్ అన్నారు. దీనికి ఆరోగ్య కార్యకర్త, ఆశా కార్యకర్తలు విధిగా హాజరు కావాలని ఆదేశించారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని జనహిత హాలులో వైద్యాధికారులు, ఐసిడిఎస్ అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు జరిగేలా చూడాలని సూచించారు. గర్భవతుల నమోదుకు రెండు శాఖల అధికారులు సమన్వయం చేసుకొని వందశాతం నమోదు చేయాలని పేర్కొన్నారు. ఇంతకు ముందు రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో గర్భవతుల నమోదులో హెచ్చుతగ్గులు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. అంగన్‌వాడి కేంద్రాల్లో గర్భవతులు, తల్లులు భౌతిక దూరం పాటించేలా చూడాలని కోరారు. ప్రతి ఒక్కరు విధిగా మాస్కులు ధరించాలని పేర్కొన్నారు. మాస్కులు ధరించని వ్యక్తులకు రూ.1000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా చిన్నారులకు వేయాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేష్ దోతురే, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ అజయ్ కుమార్, ఐసిడిఎస్ అధికారులు పాల్గొన్నారు.
Tags: Kamareddy,collector,Sharath,Review,Icdcs