క్వారెంటైన్‌లో లేను : కమల్ హాసన్

by Shyam |
క్వారెంటైన్‌లో లేను : కమల్ హాసన్
X

దిశ, వెబ్‌డెస్క్: లోక నాయకుడు కమల్ హాసన్ పెద్ద మనుసు చాటుకున్నారు. కరోనా వైరస్ కల్లోలం కారణంగా ప్రజలు పడుతున్న బాధను చూడలేకపోయిన కమల్.. తన ఇంటిని ఆస్పత్రిగా మార్చేందుకు ముందుకొచ్చారు. తద్వారా కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. ఇందుకు ప్రభుత్వ అనుమతిని కోరారు. దీంతో పాటు షూటింగ్‌లు వాయిదా పడడంతో బాధపడుతున్నపేద కళాకారులకు రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

అయితే ఇంత చేసిన కమల్‌పై సోషల్ మీడియాలో ఓ ఫేక్ న్యూస్ వచ్చింది. కమల్ క్వారెంటైన్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో దీనిపై క్లారిటీ ఇచ్చాడు కమల్. నా ఇంటి వెలుపల అంటించిన నోటీస్ ఆధారంగా అందరూ అలా అభిప్రాయపడుతున్నారని.. కానీ అందులో ఎలాంటి నిజం లేదన్నారు. చాలా ఏళ్లుగా నేను ఆ ఇంట్లో ఉండడం లేదని… మక్కళ్ నీధి మయం పార్టీ కార్యాలయంగా వినియోగిస్తున్నామని తెలిపారు. కావున… నేను క్వారెంటైన్‌లో ఉన్నానన్న వార్త అబద్ధమని చెప్పారు. అందరూ అభిమానులకు సూచించినట్లుగానే సామాజిక దూరాన్ని పాటిస్తున్నానని వెల్లడించారు. ఒక వార్త రాసేముందు నిజానిజాలు తెలుసుకోవాలని మీడియాకు రిక్వెస్ట్ చేశారు.

Tags: Kamal Hassan, CoronaVirus, Covid19, Quarentine, Social Distance

Advertisement

Next Story