‘అంధకారం’నకు కమల్ అభినందన

by Shamantha N |   ( Updated:2020-11-27 06:21:24.0  )
‘అంధకారం’నకు కమల్ అభినందన
X

దిశ, వెబ్‌డెస్క్ : సప్సెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘అంధకారం’ ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్‌‌లో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వి. విఘ్నరాజన్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాను డైరెక్టర్ అట్లీ నిర్మించారు. అంధకారంలో దెయ్యం ఉందా? లేదా? అనే ఎలిమెంట్.. వరుస ఆత్మహత్యలు.. వీటి వెనుక ఉన్న ఆంతర్యం.. వంటి అంశాలను స్టోరీ లైన్‌గా తీసుకుని సూపర్ గ్రిప్పింగ్‌గా ప్రజెంట్ చేశాడు దర్శకుడు. అర్జున్ దాస్, వినోద్ కిషన్, పూజా రామచంద్రన్, జీవా రవి, కుమార్ నటరాజన్ ప్రధాన పాత్రల్లో కనిపించిన సినిమా ప్రేక్షకులకు సూపర్ థ్రిల్ ఇచ్చింది. చివరి వరకు కూడా సస్పెన్స్ మెయింటైన్ చేసిన మూవీ.. ఆడియన్స్‌కు థ్రిల్లింగ్ జర్నీ ఇవ్వడంలో సక్సెస్ అయింది.

https://twitter.com/priyaatlee/status/1332242100839088135?s=19

కాగా బ్రిలియంట్‌గా తెరకెక్కించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘అంధకారం’ చూసిన ఉలగనయగన్ కమల్ హాసన్ అంధకారం టీమ్‌ను అభినందించారు. ఇంటికి పిలిచి మరీ అప్రిషియేట్ చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అట్లీ.. తమకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ, ఆశీర్వాదం అందిస్తున్న లోకనాయకుడికి కృతజ్ఞతలు తెలిపాడు. మీరిచ్చే ఎంకరేజ్‌మెంట్ మరింత కొత్తగా ప్రయత్నించాలన్న కసిని పెంచుతుందని చెప్పాడు.

Advertisement

Next Story

Most Viewed