- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కన్నీరు పెట్టుకున్న కళ్యాణి ప్రియదర్శన్…
దిశ, వెబ్‌డెస్క్: కళ్యాణి ప్రియదర్శన్.. ‘హలో’, ‘చిత్రలహరి’, ‘రణరంగం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తన ఇన్నోసెంట్ లుక్స్‌తో కట్టిపడేసిన ప్రియదర్శన్ నిజంగా చాలా సెన్సిటివ్. కరోనా వైరస్ కారణంగా భారత్ మొత్తం లాక్ డౌన్‌లో ఉండగా.. ఈ 21 రోజుల సమయాన్ని పూర్తిగా సినిమాలు చూస్తూనే గడపాలనుకుంది. ఈ క్రమంలోనే రోజుకో సినిమా చూస్తున్న కళ్యాణి … కొరియన్ మూవీ ‘మిరాకిల్ ఇన్ సెల్ నెం. 7’ మూవీ చూసి కన్నీరు పెట్టుకుందట. ఇంతకు ముందు సినిమా చూసి ఎప్పుడు ఏడ్చానో గుర్తు లేదని… ఈ చిత్రం చూశాక భావోద్వేగానికి గురయ్యానని కన్నీరు ఆగలేదని తెలిపింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన భామ… మీరు కూడా వీలైతే చూడాలని కోరింది.
I don’t normally recommend films on my Twitter. But felt this is a film everyone should watch if they can. Some stories are universal. Every language and every culture can relate.This is one such gem. And now we have the time to watch #CoronaLockdown @Aras_B_iynemli @Altikirkbes pic.twitter.com/ImiXiGm9LD
— Kalyani Priyadarshan (@kalyanipriyan) March 27, 2020
మామూలుగా ఐతే ఒక సినిమా చూడాలని ట్విట్టర్ వేదికగా రికమెండ్ చేయనన్న కళ్యాణి…. కానీ ఈ సినిమా ప్రతీ ఒక్కరు చూడాల్సిన సినిమా అనుకుంటున్నానని తెలిపింది. కొన్ని కథలు యూనివర్సల్… ఆ ఎమోషన్‌ను అర్ధం చేసుకునేందుకు భాష, సంస్కృతితో సంబంధం లేదని చెప్పింది. అలాంటి అద్భుత ఆణిముత్యం ‘మిరాకిల్ ఇన్ సెల్ నెం. 7’ అని అభిప్రాయపడింది కళ్యాణి.
‘మిరాకిల్ ఇన్ సెల్ నంబర్ 7’ 2013లో లీ హ్వాన్-క్యుంగ్ దర్శకత్వంలో వచ్చిన దక్షిణ కొరియన్ మూవీ. ర్యు సేంగ్-రయాంగ్, కల్ సో-గెలి, పార్క్ షిన్-హై ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ సినిమాలో కామేడీతో పాటు హృదయాన్ని కదిలించే కుటుంబ కథా నేపథ్యంలో సాగుతుంది. మానసిక వికలాంగుడైన వ్యక్తి చేయని నేరానికి జైలు శిక్ష అనుభవిస్తుంటాడు. అదే జైల్లో పరిచయమైన కొందరు … ఆ వ్యక్తికి సహాయం చేస్తారు. తన ఏడేళ్ల కూతురును తీసుకొచ్చి జైల్లో ఎవరికి తెలియకుండా దాచిపెడతారు. ఆ క్రమంలో చోటు చేసుకునే కామెడీ… తండ్రి, కూతుళ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కంటతడి పెట్టిస్తాయట.
Tags : Kalyani Priyadarshan, Miracle In Cell No. 7, Hello, Chitralahari, Ranarangam