- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్.. ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవం
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి వేసిన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరుఫున సిట్టింగ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నామినేషన్ వేయగా, ఇండిపెండెంట్‌గా కోటగిరి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం నామినేషన్ల పరిశీలనలో భాగంగా ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ పత్రాలు సరిగ్గా లేవని అధికారులు ఆ నామినేషన్‌ను తిరస్కరించారు.
ఇదే విషయాన్ని అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్ కూడా తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నారాయణ రెడ్డి అధికారికంగా మూడు గంటల తర్వాత ప్రకటించనున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన కోటగిరి శ్రీనివాస్ నామినేషన్‌లో అఫిడవిట్ పత్రాలను జ్యుడీషియల్ ప్రకారం ఇవ్వకపోవడంతో నామినేషన్‌ను తిరస్కరించినట్టు తెలిసింది. బుధవారం ఉదయం నామినేషన్ల స్క్రూట్నీ సమయంలో ఇద్దరు స్థానిక సంస్థల ఓటర్లు.. కోటగిరి శ్రీనివాస్ నామినేషన్ పత్రాల్లో తమ సంతకాలు ఫోర్జరీ చేశారని ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కానీ, ఈ విషయాన్ని కోటగిరి శ్రీనివాస్ ఖండించారు. ఈ నేపథ్యంలో అధికారిక ప్రకటన కోసం టీఆర్ఎస్ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. వారంతా సంబురాలకు సిద్ధం అవుతున్నారు.