- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాజు, కిచ్లు.. స్వీట్ లవ్ స్టోరీ
దిశ, వెబ్‌డెస్క్ :
అందాల చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి కన్నుల పండుగగా జరిగింది. బెస్ట్ ఫ్రెండ్, సోల్‌మేట్ గౌతమ్ కిచ్లుతో మూడు ముళ్లు వేయించుకుని, తనకు ప్రేమగా ముద్దు పెడుతూ నవ్వులు చిందించిన కాజల్ పెళ్లి ఫొటోలు చూసి అభిమానులు కూడా ఆనందపడ్డారు. కానీ వారి ప్రేమకు బీజం పడింది ఎక్కడ? అనే విషయం గురించి తెలుసుకోవాలని ఫ్యాన్స్ చాలా ఆరాటపడ్డారు. అభిమానుల ఎగ్జైట్‌మెంట్‌ను దృష్టిలో ఉంచుకుని.. అసలు వాళ్లిద్దరు ఎలా కలుసుకున్నారు? ఎందుకు కలుసుకోలేకుండా ఉండలేకపోయారు? ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేమని ఎప్పుడు అర్ధం చేసుకున్నారు? ఏడడుగులు వేసి కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకుంది ఎప్పుడు? అనే విషయాల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించింది కాజల్.
కామన్ ఫ్రెండ్స్ ద్వారా గౌతమ్‌ను కలిసిన కాజల్.. తమది ఇప్పటికే పదేళ్ల బంధం అని వివరించింది. ఏడేళ్ల స్నేహం.. మూడేళ్ల డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపింది. ప్రతీ ఫంక్షన్‌లోనూ కలిసిన తాము కరోనా కారణంగా కొన్ని వారాల పాటు కలుసుకోలేని పరిస్థితి ఏర్పడిందని, అప్పుడే ఒకరినొకరం చూడకుండా ఉండడం కష్టం అనిపించిదని.. దీంతో మాస్క్‌లు ధరించి గ్రాసరీ స్టోర్‌లో కలుసుకున్నామని తెలిపింది. ఆ టైమ్‌లోనే.. ఇక లాభం లేదు మ్యారేజ్ చేసుకుందామని డిసైట్ అయ్యామని చెప్పింది కాజల్.
గౌతమ్ తనకు ఫిల్మీ టైప్‌లో ప్రపోజ్ చేయలేదు కానీ, తమ ఇద్దరి మధ్య ఆ టైమ్‌లో జరిగిన సంభాషణ చాలా ఎమోషనల్‌గా జరిగిందని తెలిపింది. ఆ తర్వాత ఏప్రిల్‌లో పేరెంట్స్‌కు విషయం చెప్పి.. జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలిపింది పంచదారబొమ్మ. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనుకున్నా కుదరలేదన్న కాజల్.. గౌతమ్ కంటే తనే రొమాంటిక్ అంటోంది.