- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ ఎమ్మెల్యే ఒక చెల్లని రూపాయి : కడియం
దిశ, వెబ్ డెస్క్ : మాజీ ఉప ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి సొంత పార్టీ నేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఒక్క రూపాయి కూడా సహాయం చేయనివాడు చాలా మాట్లాడతాడు.. అతనో చెల్లని రూపాయి’ అంటూ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. పదవులు అమ్ముకుంటున్నారు, పనులు అమ్ముకుంటున్నారు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. నెత్తిమీద పది రూపాయలు పెడితే అమ్ముడు పోనివారు కూడా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
దీంతో స్టేషన్ ఘనపూర్ రాజకీయాలు వేడెక్కాయి. ‘నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేదు. పదివి ఇప్పిస్తాననో లేదా ఇంక ఏవిధంగానైనా ఏ ఒక్కరి దగ్గరైనా ఒక రూపాయి తీసుకున్నాను అని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తాను’ అని కడియం సవాల్ విసిరారు. కాగా కడియం చేసిన ఈ వ్యాఖ్యలు సెన్సేషనల్ గా మారాయి. రాజకీయ వర్గాల్లో పలు చర్చలకు దారి తీస్తున్నాయి.