మాజీ ఉప ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ ఊరేగింపు, దహనం

by  |   ( Updated:2023-03-30 17:33:40.0  )
మాజీ ఉప ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ ఊరేగింపు, దహనం
X

దిశ, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా చిల్పూర్ మండలం లింగం పల్లి గ్రామంలో మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి దిష్టిబొమ్మను సోమవారం ఊరేగించి దహనం చేశారు. ఈనెల 29న ఉమ్మడి వరంగల్ జిల్లా ఇరిగేషన్ సమావేశంలో కడియం శ్రీహరి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సాగు, తాగునీటి వర ప్రదాయిని, రెండు పంటలకు నీరు అందించేది లింగంపల్లి రిజర్వాయర్. దీని నిర్మాణం పనులు వెంటనే ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలని ఉమ్మడి వరంగల్ జిల్లా చిన్న నీటి పారుదల, జే. ఆర్. సీ దేవాదుల ప్రాజెక్టుపై హన్మకొండ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కడియం శ్రీహరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ రిజర్వాయర్‌కు సంబంధించి సర్వే చేయడం, అంచనాలు రూపొందించడం, టెండర్లు పిలవడం, ఒప్పందం జరగడం పూర్తయిందని, నిర్మాణ పనులు వెంటనే చేపడితే ఇక్కడి ప్రజలకు ఇక భవిష్యత్తులో ఎంత కరువు వచ్చినా నీటి కొరత ఉండదని తెలిపారు. ఇంతటి ముఖ్యమైన లింగంపల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు వెంటనే చేపట్టే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పనులు ప్రారంభించే విధంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, జిల్లా నేతలు సహకరించాలని శ్రీహరి కోరారు. అయితే రిజర్వాయర్ నిర్మాణం చేపడితే వ్యవసాయ భూములు, ఆవాసాలు పూర్తిగా నష్టపోయి ఊరు ఊరే ఖాళీ చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తూ కడియం శ్రీహరి‌కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, శ్రీహరి దిష్టిబొమ్మను ఊరేగించిన దహనం చేయడం అధికార పార్టీ నేతల్లోనే విమర్శలకు తెరలేపింది

Advertisement

Next Story

Most Viewed