మామిళ్లపల్లె పేలుడు ఘటనలో వైఎస్ ప్రతాప్ రెడ్డి అరెస్టు

by srinivas |
మామిళ్లపల్లె పేలుడు ఘటనలో వైఎస్ ప్రతాప్ రెడ్డి అరెస్టు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని కడప జిల్లా మామిళ్లపల్లె పేలుడు ఘటనలో 10 మంది కార్మికులు మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే క్వారీ లీజుదారుడు నాగేశ్వర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రెండ్రోజుల కిందట వాహనంలో జిలెటిన్ స్టిక్స్ తరలిస్తుండగా ప్రమాదవశాత్తు అవి పేలడంతో పది మంది కార్మికుల శరీరాలు చెల్లచెదురయ్యాయి. దీనిపై సీరియస్ అయిన ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా వైఎస్ ప్రతాప్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పేలుడు పదార్థాల తరలింపులో నిబంధనలు అతిక్రమించినట్లు పలు ఆరోపణలు రాగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈయన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి పెద్దనాన్న. ప్రతాప్ రెడ్డికి పులివెందుల, సింహాద్రి పురం, లింగాల పరిసర ప్రాంతాల్లో గనులు ఉన్నాయి. అంతేకాకుండా పేలుడుకు వినియోగించే జిలెటిన్ స్టిక్స్‌కు మ్యాగజైన్ లైసెన్స్ కలిగిన వ్యక్తి. మామిళ్లపల్లె గనికి ఈయన పేలుడు పదార్థాలు సరఫరా చేశాడు. ఆ సమయంలో నిబంధనలకు తూట్లు పొడిచినట్లు పోలీసులు గుర్తించారు. ఇదిలాఉండగా, ఈ కేసులో లీజుదారుడితో పాటు మరో వ్యక్తిని కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story