కడప విమాన ప్రయాణ రోజుల్లో మార్పులు

by srinivas |
కడప విమాన ప్రయాణ రోజుల్లో మార్పులు
X

దిశ, ఏపీ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణ ఆంక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కడప ఎయిర్‌ పోర్టు నుంచి తిరిగే విమాన ప్రయాణ రోజులలో అధికారులు మార్పులు చేశారు. రెండు నెలల సుదీర్ఘ విరామం తరువాత మే 25 నుంచి విమాన ప్రయాణాలు ఆరంభమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మంగళవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం హైదరాబాదు–కడప మధ్య సర్వీసు నడుస్తుండగా ఇకపై సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో ప్రయాణం చేసేలా రోజులు మార్చారు. అలాగే కడప నుంచి చెన్నైకి గతంలో సోమ, బుధ, గురువారాల్లో విమానం నడుస్తుండగా, ఇకపై మంగళ, గురు, శనివారాల్లో విమానాలు వచ్చెలా షెడ్యూల్‌ రూపొందించారు. ఈ నెల 14 నుంచి 31 వరకు విమానాలు ఈ షెడ్యూల్‌ ప్రకారమే తిరుగుతాయని తెలిపారు.

Advertisement

Next Story