‘కాచిగూడ నుంచి యెలహంక’కు ప్రత్యేక రైళ్లు..

by Anukaran |   ( Updated:2021-01-27 09:07:44.0  )
‘కాచిగూడ నుంచి యెలహంక’కు ప్రత్యేక రైళ్లు..
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలోని కాచిగూడ నుంచి కర్ణాటక రాష్ట్రం యెలహంక వరకు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. 12గంటల ప్రయాణానికి సంబంధించిన తొలి రైలు సర్వీసును కాచిగూడ నుంచి యెలహంకకు (నెంబర్-07603)ను బుధవారం ప్రారంభించారు. షాద్‌నగర్, మహబూబ్ నగర్, కర్నూల్ సిటీ మీదుగా వెళ్లే ఈ ట్రైన్ సర్వీసు ప్రతిరోజూ అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు. రాత్రి 9.05 గంటలకు కాచిగూడ నుంచి బయలు దేరిన రైలు మరుసటి ఉదయం 9.35 గంటలకు యెలహంక స్టేషన్‌లో ఆగుతుందని సమాచారం.

అదే విధంగా యెలహంక నుంచి కాచిగూడకు (రైలు నెంబర్ -07604) గురువారం ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటల 20 నిమిషాలకు యెలహంకలో ప్రారంభమైన ప్రత్యేకరైలు మరుసటి ఉదయం 5గంటలకు కాచిగూడ స్టేషన్‌కు చేరుకుంటుందని తెలుస్తోంది. ఈ స్పెషల్ ట్రైన్‌లో ఏసీ-2 టైర్, 3టైర్, స్లీపర్ మరియు జనరల్, సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. మరిన్ని వివరాలను దక్షిణ మధ్య రైల్వే వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story