అప్ఘాన్ సరిహద్దులో వేలమంది శరణార్థులు

by Anukaran |   ( Updated:2021-09-01 05:05:27.0  )
అప్ఘాన్ సరిహద్దులో వేలమంది శరణార్థులు
X

దిశ వెబ్‌డెస్క్: సుదీర్ఘ యుద్ధం ముగిసింది. ఆదుకుంటుదనుకున్న అమెరికా అర్థాంతరంగా వదిలి వెళ్లిపోయింది. తరలింపు ముగిసినట్లు ప్రకటించింది. దాంతో కాబూల్‌లో మిగిలిన వేలాది మంది అప్ఘాన్‌లు సరిహద్దు దేశాలలోకి శరణార్థులుగా వెళ్లడానికి సిద్దమయ్యారు. కొన్ని వేల మంది అప్ఘాన్ పౌరులు పాకిస్తాన్, ఇరాన్, ఉజ్భెకిస్తాన్, తజికిస్తాన్ దేశాల సరిహద్ధుల వద్ద వేచి ఉన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.

మరోవైపు తాలిబన్లతో చర్చలు జరిపేందుకు బ్రిటన్ సిద్దమయింది. దోహలో వివిధ అంశాలపై చర్చించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు అప్ఘాన్ శరణార్థులను ఆదుకునేందుకు ఆపరేషన్ వార్మ్ వెల్కమ్ చేపడుతున్నట్లు టెన్ డౌనింగ్ స్ట్రీట్ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న శరణార్థులతో పాటు పాకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్భెకిస్తాన్ దేశాలకు రాయబారులకు పంపినట్లు ప్రకటించింది. వీలైనంత మంది శరణార్థులను దేశం లోపలికి అనుమతి ఇస్తామని లండన్ తెలిపింది. అందుకే వీరిని ప్రత్యేకంగా ఆయా దేశాలకు పంపినట్లు పేర్కొంది. వీరి ద్వారా శరణార్థుల తరలింపు ప్రక్రియ చేపట్టే ఆలోచనలో లండన్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పంజ్‌షీర్ ప్రావిన్స్‌‌లోకి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించిన తాలిబన్లను కాల్చిచంపినట్లు రెసిస్టెన్స్ గ్రూప్ ప్రకటించింది. దాదాపు 350 మంది తాలిబన్లను హతమార్చినట్లు వెల్లడించింది. మరో 40 నుంచి 50 మంది దాకా బందీలుగా చిక్కినట్లు పేర్కొంది.

అల్‌ఖైదా సంచలన వ్యాఖ్యలు.. మన నెక్స్ట్ టార్గెట్ కాశ్మీర్ అంటూ

Advertisement

Next Story