సినిమా టికెట్లు, షోస్‌ తగ్గింపు‌పై కే రాఘవేంద్ర రావు కీలక ప్రకటన

by srinivas |   ( Updated:2021-12-01 11:29:52.0  )
సినిమా టికెట్లు, షోస్‌ తగ్గింపు‌పై కే రాఘవేంద్ర రావు కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ‘సినిమా’పై ఏపీ ప్రభుత్వం‌ కొత్తగా తీసుకొచ్చిన చట్టసవరణతో అదనపు షోలు రద్దు, టికెట్ ధరలు కూడా తగ్గించనున్నారు. ఈ వ్యవహారంపై టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ మరోసారి పునరాలోచించి చట్టసవరణను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. తాజాగా ఇదే విషయంపై సీనియర్ దర్శకుడు కే రాఘవేంద్ర రావు స్పందించారు. సోషల్ మీడియా వేదిక భారీ ప్రకటన విడుదల చేశారు.

‘48 సంవత్సరాల ఇండస్ట్రీలో దర్శకుడిగా-నిర్మాతగా నా అభిప్రాయాలు అర్ధం చేసుకోండి. మనం ఎప్పుడూ మూలాల్ని మర్చిపోకూడదు.. నేను ఇవాళ ఈ పొజిషన్‌లో ఉండటానికి కారణం ముందుగా ప్రేక్షకులు-థియేటర్ల యాజమాన్యం-డిస్ట్రిబ్యూటర్స్-నా నిర్మాతలు. వీళ్లందరూ బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. ప్రస్తుతం టికెట్ల ధరల, షోస్ తగ్గింపు నిర్ణయంతో చాలా మంది తీవ్ర నష్టాలకు గురవుతారు. కామన్ మ్యాన్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా ఒక్కటే..!! ఒక గొప్ప అద్భుతమైన కథ కానీ, హృదయానికి హత్తుకునే కథ కానీ, సరదా సరదాగా చూసే సినిమా గానీ థియేటర్లలో అంటే పెద్ద స్ర్కీన్‌లలో DTS ATMOS -3D చూసిన అనుభూతి టీవీలో ఎట్టిపరిస్థితుల్లో ఉండదు. షోస్ తగ్గించడం వలన గానీ, టికెట్ల ధర తగ్గించడం వలన గానీ పైన చెప్పిన అందరూ నష్టపోతారు’.

‘ఒక్క హిట్ సినిమా ఎక్కువ షోస్ వేసుకున్నా మొదటి వారం ధరలు పెంచుకోవడం వలన, తర్వాత కొన్ని మమూలు సినిమాలు వచ్చినా థియేటర్ల యాజమాన్యం – వాళ్లని నమ్ముకున్న కొన్ని వేల మందికి 2, 3 నెలలకి సరిపడా ఆదాయం సమకూరుతుంది. ఎందుకంటే 100 సినిమాలలో 10 శాతం హిట్స్ కన్నా ఎక్కువ ఉండవు. 10 శాతం యావరేజ్. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఆన్‌లైన్ వలన దోపిడీ ఆగిపోతోంది అనడం కరెక్ట్ కాదు. ప్రేక్షకుడు ఒక మంచి సినిమా చూడాలనుకుంటే టికెట్ ధర రూ. 300 అయినా, 500 అయినా చూస్తాడు. ఒక రూపాయికే సినిమా చూపిస్తామన్నా అతనికి నచ్చని సినిమా చూడడు. పైగా ఆన్‌లైన్‌లో చాలా మంది సర్కిల్ ఉన్నవాళ్లు బ్లాక్ చేసుకొని, వాళ్ల శిష్యుల ద్వారా బ్లాక్‌లో అమ్మవచ్చు. అదే రేట్లు పెంచి ఆన్‌లైన్‌లో అమ్మితే థియేటర్ల వలన గవర్నమెంట్‌కి ఎక్కువ ట్యాక్స్ వస్తుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని తగిన న్యాయం చేకూర్చాలని ఆశిస్తున్నాను’ అంటూ కే రాఘవేంద్ర రావు ప్రభుత్వాన్ని కోరారు.

భారీగా విరాళం ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్

Advertisement

Next Story

Most Viewed