- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేప్ కేసులో జైలు శిక్ష.. రూ. 550 కోట్ల అవార్డు!
దిశ, ఫీచర్స్ : మర్డర్లు, మానభంగాలు చేసి కూడా బెయిల్ మీద బయటికొచ్చి దర్జాగా తిరుగుతున్న రోజులు.. దొంగతనాలు, దోపిడీలకు పాల్పడి పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న సొసైటీ.. అలాంటిది ఓ ఇద్దరు అన్నదమ్ములు తాము చేయని తప్పుకు దశాబ్దాల పాటు జైలు శిక్ష అనుభవించారు. 11 ఏళ్ల బాలికపై రేప్, హత్య ఆరోపణలతో సగం జీవితాన్ని కారాగారంలోనే గడిపారు. అయితే చేయని నేరాన్ని వారు ఎలా ఒప్పుకున్నారు? జైలు నుంచి బయటికి ఎలా వచ్చారు? రూ.550 కోట్ల అవార్డు ఎందుకు వచ్చింది? మీరూ తెలుసుకోండి..
యూఎస్, నార్త్ కరోలినాకు చెందిన అన్నదమ్ములు ‘హెన్రీ మెక్‌కల్లమ్, లియోన్ బ్రౌన్’కు ఐక్యూ లెవెల్స్ చాలా తక్కువ. ఈ క్రమంలోనే 1983లో ఓ మైనర్ బాలికపై జరిగిన రేప్, మర్డర్ కేసులో ఇరుక్కున్న బ్రదర్స్.. 31 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించిన అసలు దోషి డీఎన్‌ఏ దొరకడంతో ఎట్టకేలకు 2014లో రిలీజ్ అయ్యారు. రాబెసన్ కౌంటీలోని రెడ్ స్ప్రింగ్స్‌లో ఈ క్రైమ్ జరగగా.. అప్పుడు హెన్రీకి 19 ఏళ్లు, లియోన్‌కు 15 ఏళ్లు మాత్రమే.
కాగా జైలు నుంచి విడుదలైన తర్వాత ‘లా ఎన్‌ఫోర్స్‌మెంట్ మెంబర్స్’పై సివిల్ కేసు వేసిన ఈ అన్నదమ్ములు.. తమ చేత నేరం ఒప్పించేందుకు ఇంటరాగేషన్ చేసిన సమయంలో పౌర హక్కులు ఉల్లంఘించబడ్డాయని ఆరోపిస్తూ 2015 నుంచి న్యాయం కోసం పోరాడుతున్నారు. ఈ మేరకు హెన్రీ, లియోన్ తక్కువ ఐక్యూ లెవెల్స్‌తో టీనేజర్లుగా ఉన్న సమయంలో పోలీసులు భయపెట్టి మరీ నేరం ఒప్పించారని, మరణశిక్ష పడేలా చేశారని తమ తరఫు అటార్నీస్ వాదనలు వినిపించారు.
కాగా, వాదనలు విన్న మీదట ఎనిమిది మంది సభ్యులతో కూడిన జ్యూరీ.. మెక్, బ్రౌన్ జైలు జీవితం గడిపిన కాలానికి నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏడాదికి 1 మిలియన్ డాలర్స్ చొప్పున 31 సంవత్సరాలకు ఒక్కొక్కరికి 31 మిలియన్ డాలర్స్‌తో పాటు శిక్షణాత్మక నష్టాల కింద మరో 13 మిలియన్ డాలర్స్ మొత్తం 75 మిలియన్ డాలర్స్(రూ.550 కోట్లు) అందజేయాలని ఆదేశించింది. ఇక న్యాయస్థానం తీర్పు వెలువరించిన తర్వాత ‘నాకు స్వేచ్ఛ లభించింది’ అని అన్నదమ్ముల్లో ఒకరైన మెక్‌కల్లమ్ వ్యాఖ్యానించాడు. అయితే తనలాంటి అమాయకులెందరో చేయని తప్పుకు జైళ్లలో మగ్గిపోతున్నారని, వారందరికీ న్యాయం జరగాలని ఆకాంక్షించాడు.