ఆ వ్యాఖ్యలు సరికాదు.. కేంద్రమంత్రిపై జూలకంటి ఫైర్

by Sridhar Babu |   ( Updated:2021-12-26 09:46:05.0  )
ఆ వ్యాఖ్యలు సరికాదు.. కేంద్రమంత్రిపై జూలకంటి ఫైర్
X

దిశ, మిర్యాలగూడ: కేంద్రం ఉపసంహరించిన రైతు చట్టాలను భవిష్యత్తులో తిరిగి కొనసాగించే యోచన ఉందన్న కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సరికాదనిమాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో పడిందని, అప్పులు చేసి పంట సాగు చేసిన రైతులకు కనీస మద్దతు ధర అందడం లేదని వాపోయారు.

రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. యాసంగిలో రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబికార్ మల్లేష్, గౌతమ్ రెడ్డి, భవాండ్ల పాండు, మంగా రెడ్డి, రాం మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story