- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆ అంశంపై జడ్జీలు నేర్చుకోవాలి’
న్యూఢిల్లీ: లింగ సున్నితత్వంపై న్యాయమూర్తులు నేర్చుకోవాల్సిన అవసరమున్నదని, తద్వారా లైంగిక దాడి కేసులను విచారిస్తున్నప్పుడు సమర్థవంతంగా పరిష్కారాన్ని సూచించగలరని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టులో స్పష్టం చేశారు. రేప్ కేసు నిందితుడికి బెయిల్ మంజూరీ కోసం బాధితురాలితో రాఖీ కట్టించుకోవాలన్ని షరతు పెడుతూ మధ్యప్రదేశ్ హైకోర్టు రూలింగ్‌ను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయమూర్తి ఏఎం ఖాన్విల్కార్ సారథ్యంలోని ధర్మాసనం ముందు వాదిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జీ వ్యాఖ్యలు ఖండనార్హమని వేణుగోపాల్ అన్నారు.
లింగ సమానత్వంపై న్యాయమూర్తులకు అవగాహన కల్పించాలని, జడ్జీల నియామక పరీక్షలోనూ జెండర్ సెన్సిటైజేషన్ అంశముండాలని సూచించారు. నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ, స్టేట్ జ్యుడీషియల్ అకాడమీలు ఈ అంశంపై కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. సుప్రీంకోర్టులో జెండర్ సెన్సిటైజేషన్, రిడ్రస్సల్ కమిటీలున్నాయని, కానీ, దిగువ న్యాయస్థానాల్లో పరిస్థితులు వేరని తెలిపారు. అందుకే హైకోర్టు సహా జిల్లా న్యాయస్థానాల్లో లింగ సున్నితత్వంపై బోధనలుండాలని సూచించారు.