- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వృత్తి కన్నా ప్రాణం విలువైనది: అల్లం నారాయణ
దిశ, న్యూస్‌బ్యూరో: వృత్తి కన్నా ప్రాణం విలువైనదని, ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ పట్ల జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మహారాష్ట్రలో 53మంది జర్నలిస్టులకు కరోనా వైరస్ సోకినట్లు వార్తలు వస్తున్నందున రాష్ట్రంలో పాత్రికేయులందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో జర్నలిస్టుల వృత్తి కత్తి మీద సాములాంటిదని, ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తిచెందిన ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం వస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీసుల నుంచి వస్తున్న సమాచారం మేరకు జర్నలిస్టులు కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు తీసుకోవడం లేదని తెలుస్తోందన్నారు.
Tags: corona virus, Telangana media academy chairman, allam narayana, maharashtra, 53 journalists, Positive police, Telangana