కరోనాతో యువ జర్నలిస్టు మృతి

by vinod kumar |
కరోనాతో యువ జర్నలిస్టు మృతి
X

దిశ, ఖమ్మం టౌన్ : కరోనా మహమ్మారి జర్నలిస్టులను వరుసగా పొట్టన బెట్టుకుంటుంది. సహచర జర్నలిస్టులు కళ్లెదుటే కానరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. తాజాగా ఖమ్మం నగరానికి చెందిన తలారి శ్యామ్ ప్రాణాలు కోల్పోయాడు. వారం రోజుల కిందట కరోనా లక్షణాలు కనిపించడంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకున్నాడు. పాజిటివ్ అని తేలడంతో ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నాడు. గతంలో అతను ఊపిరితిత్తుల సమస్యతో బాధపడ్డాడు. తాజాగా కరోనా సోకడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి కన్నుమూశాడు. మృతుడు గతంలో సూర్య, మనం పత్రికల్లో విలేకరిగా పని చేశాడు.

టీయూడబ్ల్యూజే సంతాపం..

తలారి శ్యామ్ మృతి పట్ల టీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ సంతాపం ప్రకటించింది. చిన్న వయసులోనే మృత్యువు కబళించడం పట్ల యూనియన్ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుని కుటుంబాన్ని ప్రెస్ అకాడమీ ద్వారా అన్ని విధాలా ఆదుకుంటామని యూనియన్ అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ ప్రకటించారు. శ్యామ్ మృతి పట్ల టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇస్మాయిల్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సయ్యద్ ఖదీర్, అడపాల నాగేందర్ తదితరులు సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed