జో బైడెన్‌కు వీరతిలకం దిద్దిన తెలంగాణ వాసి

by Anukaran |   ( Updated:2020-11-07 07:18:42.0  )
జో బైడెన్‌కు వీరతిలకం దిద్దిన తెలంగాణ వాసి
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణకు చెందిన పూజారి అమెరికాకు కాబోయే అధ్యక్షుడికి వీర తిలకం దిద్దాడని మీకు తెలుసా..? మారుమూల పల్లెకు చెందిన వ్యక్తిని అగ్రరాజ్యాది నేత ఎలా కలుసుకున్నాడు..? అతడే వీర తిలకం దిద్దాడానికి కారణమేవరు..? అగ్రరాజ్యానికి ఆ క్షేత్రానికి లింకెంటి..? ఇవన్నీ తెలుసుకోవాలంటే.. ‘దిశ’అందిస్తున్న ఈ ప్రత్యేక కథనం చదవాల్సిందే..

తెలంగాణాలోని జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణానికి చెందిన కశోజ్ఝుల చంద్రశేఖర్ శర్మ సంస్కృత వేద పాఠశాలలో ఏడో తరగతి వరకు చదువుకుని, శృంగేరి, హరిద్వార్, ఢిల్లిలో వేదం నేర్చుకున్నారు. 2001 మేలో అమెరికా వెల్లేందుకు ప్రయత్నించాడు. చెన్నైలోని కాన్సులేట్ చుట్టూ తిరిగినా స్టాంపింగ్ కాలేదు. డెలవర్ రాష్ట్రం విల్మింగ్టన్ టౌన్ కు చెందిన అక్కడి ఆలయ పూజారులు కూడా తీవ్ర ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో డెలవర్ స్టేట్ సెనేటర్ గా ఉన్న జోబైడెన్, ధామస్ కార్పర్ అనే మరో సెనేటర్ తో కలిసి వీసా క్లియరెన్స్ చేయించడంతో చంద్రశేఖర్ శర్మ అమెరికా వెల్లడానికి మార్గం సుగమం అయింది. అప్పటి నుంచి అక్కడి మహాలక్ష్మి ఆలయంలో అసిస్టెంట్ పురోహితునిగా పనిచేస్తున్నాడు చంద్రశేఖర్ శర్మ.

మహాలక్ష్మి ఆలయంలో 2003 కుంభాబిషేకం నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమానికి సెనేటర్ జో బైడెన్ కూడా హాజరయ్యారు. అప్పుడు జో బైడన్ కు చంద్రశేఖర శర్మ తిలకం దిద్దారు. అప్పుడు తీసిన ఫొటో జో బైడెన్ అధ్యక్షుడు అవుతుండడంతో ఇప్పుడు వైరల్ అవుతోంది. చంద్రశేఖర హరిద్వార్ లో ఉన్న సమయంలోనే ఆయనకు అమెరికా నుంచి ఆఫర్ వచ్చింది. 2003లో జరిగిన కుంభాబిషేకానికి సెనైటర్ హోదాలో హాజరైన బైడెన్ తో కలిసి దిగినప్పటిదే ఆ ఫోటో అని చంద్రశేఖర్ శర్మ కుటుంబీకులు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed