ప్రచారంలో జో బిడెన్ సంచలన హామీ 

by vinod kumar |
ప్రచారంలో జో బిడెన్ సంచలన హామీ 
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగింపునకు వచ్చేశాయి. పోలింగ్‌కి మిగిలింది ఆరు రోజులే. ఈ క్రమంలో అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న రిపబ్లికన్, డెమొక్రటిక్ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే ప్రకటనలతో ముందుకెళ్తున్నారు. కొవిడ్-19ను ఎదుర్కొనే అంశంలో డొనాల్డ్ ట్రంప్ వైఫల్యాలాలపై విమర్శల నేపథ్యంలో ట్రంప్ సమర్థించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అదే సమయంలో ట్రంపునకు వ్యతిరేకంగా ఉన్న నల్లజాతీయులను తనవైపుకు తిప్పుకునేందుకు బిడెన్ ప్రయత్నిస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేయగల అంశాలపై ప్రకటనలు చేస్తూ బిడెన్ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. డెమొక్రటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఉన్న జో బిడెన్ ఈక్వాలిటీ యాక్ట్ ఎల్‌జీబీటీక్యూ (lesbian, gay, bisexual, transgender and queer) హక్కుల చట్టం ఆమోదానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు హామీ ఇచ్చారు.

ఎన్నికల్లో గెలిస్తే 100 రోజుల్లోగా ఎల్‌జీబీటీక్యూ రైట్స్ యాక్ట్‌పై సంతకం చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. జో బిడెన్ 2009 నుంచి 2017 వరకు బరాక్ ఒబామా ఆద్వర్యంలో వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలోనూ ఎల్‌జీబీటీక్యూ హక్కుల కోసం పోరాడారు. సమానత్వాన్ని అమెరికా దౌత్య విధానంలో కీలక అంశంగా మార్చడం ద్వారా అంతర్జాతీయంగా సమానత్వ హక్కులను విస్తరించనున్నట్టు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Advertisement

Next Story