- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా జో బిడెన్
దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా జో బిడెన్‌ను డెమోక్రాట్ పార్టీ నామినేట్ చేసింది. నామినేషన్ స్వీకరణ సందర్భంగా జో బిడెన్ మాట్లాడుతూ… దేశంలో సుదీర్ఘకాలంగా నెలకొన్న చీకటి కాలాన్ని అంతమొందించేలా అందరూ కలిసి ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తనకు అధ్యక్షపట్టం కట్టబెడితే తాను చీకటితో కాదు, కాంతితో జట్టుకడతారని చెప్పారు.
అమెరికా గొప్పతనాన్ని మరింత ఇనుమడింపజేస్తానని వివరించారు. ఎలాంటి తప్పులు చేయకుండా అమెరికాలోని చీకటి కాలాన్ని అధిగమిస్తారని తెలిపారు. కరోనా కారణంగా వర్చువల్ కాన్ఫరెన్స్‌లోనే డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ జో బిడెన్‌ను అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ చేసింది. మూడు దశాబ్దాలు సెనేటర్‌గా ఆయనసేవలందించిన డెలవేర్ నుంచి మాట్లాడుతూ… ట్రంప్‌పై నేరుగా విమర్శలు సంధించారు.
మహమ్మారిని కట్టడి చేయడంలో, ఆర్థిక వ్యవస్థను కాపాడటంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ట్రంప్ దేనినీ బాధ్యతగా తీసుకోరని, నాయకత్వంలో ఉండి నడిపించడానికి నిరాకరిస్తారని, ఇతరులపై నిందలు మోపుతారని, నియంతలతో స్నేహం చేసి విద్వేషం, విభజన నిప్పును వెదజల్లుతారని విమర్శలు కురిపించారు. ఇవి జీవితాలను మార్చే ఎన్నికలని, అమెరికా భవితవ్యాన్ని నిర్దేశించేవని అన్నారు. ఈ ఎన్నికల బ్యాలెట్లే అమెరికా భవిష్యత్తును నిర్దేశిస్తాయని వివరించారు.