- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గురుకులాల్లో కొలువు సాధించండిలా..!
దిశ, కెరీర్: తెలంగాణ గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఈ నోటిఫికేషన్ల ద్వారా 9231 పోస్టులు భర్తీ చేయనున్నారు. మొత్తం 9 నోటిఫికేషన్ల ద్వారా గ్రాడ్యుయేట్ టీచర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ఆర్ట్, డ్రాయింగ్, మ్యూజిక్, క్రాఫ్ట్ టీచర్ పోస్టులను మూడు గురుకుల సొసైటీల్లోని పాఠశాలల్లో భర్తీ చేస్తున్నారు. అలాగే డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, పీడీ, లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి తాజాగా ప్రకటన వెలువడింది. ఇక అభ్యర్థులు టీచింగ్ పోస్టులతోపాటు ఇతర పోస్టులకు వారి అర్హతలను బట్టి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గురుకుల విద్యా సంస్థల్లో తమ కెరీర్‌ను ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు ఇదో సువర్ణావకాశం.. అభ్యర్థుల ఎలిజిబిలిటీని బట్టి సంబంధిత ఉద్యోగాలకు సిద్ధం కావాలి.
ఈ ఉద్యోగాలకు సిద్ధమయ్యే అభ్యర్థులు నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలి. రోస్టర్ పాయింట్ల ప్రకారం పోస్టులు ఎన్ని ఉన్నాయనేది గమనించాలి. దీని ప్రకారం ఎక్కువ పోస్టులున్న నోటిఫికేషన్లకు అభ్యర్థులు సిద్ధమవడమే అభ్యర్థుల ప్రథమ కర్తవ్యంగా ఉండాలి. మరోవైపు గ్రూప్ 1, 2,3,4 పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్లకు ప్రిపేరవుతుంటారు. ఇలాంటి అభ్యర్థులకు జనరల్ స్టడీస్ పార్ట్ చాలా బాగా కలిసివచ్చే అంశం. ఎలాగూ గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేరవుతుంటారు కాబట్టి, వీరు ఈ పరీక్షలకు సంబంధించిన ఇతర సబ్జెక్టులపై దృష్టి కేంద్రీకరించాలి.
మొత్తానికి అభ్యర్థులు సిలబస్ చూసుకుని ఏయే సబ్జెక్టులు కామన్‌గా ఉంటున్నాయో చూసుకుని ఆయా పరీక్షలపైనే పూర్తిగా ప్రిపరేషన్ చేసుకుంటే మంచిది. సబ్జెక్టుపై ఉన్న పట్టు, పరీక్షలకు ఉన్న సమయం, సిలబస్ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని సిద్ధమైతే సర్వీస్ సాధించవచ్చు. సిలబస్ ప్రకారం పరీక్షలను ఎంచుకుంటే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. లేదంటే సమయం సరిపోక చివరకు ఉద్యోగం కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఏయే పరీక్షలు రాయాలో అనే దానిపై ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.
జనరల్ స్టడీస్ ప్రశ్నలడిగే తీరు మారింది:
ఇటీవల కొత్త సిలబస్ ప్రకారం ఇంగ్లీష్ లో ప్రశ్నలు బాగా అడుగుతున్నారు. దాదాపు పది శాతం పైగా ప్రశ్నలు ఇంగ్లీష్ నుంచి ఉంటాయనేది గమనించండి. అందుకే ఇంగ్లీషు భాషపై పట్టు సాధించడం తప్పనిసరి. ఈ విభాగంలో గ్రామీణ విద్యార్థులు చాలా ఇబ్బంది ఫీలవుతుంటారు. పట్టణాలు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో చదివిన విద్యార్థులకు ఈ సమస్య ఉండదు. కేవలం గ్రామీణ నేపథ్యం ఉన్న అభ్యర్థులు ఇంగ్లీష్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కొందరికి ఇంగ్లీష్ తెలిసినా గ్రామర్ పై పట్టు ఉండదు. ప్రశ్నలు గ్రామర్ ఆధారంగానే ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
జనరల్ స్టడీస్:
సబ్జెక్ట్స్ లో అందరూ బాగానే స్కోరు సాధిస్తారు. కానీ జనరల్ స్టడీస్ విషయంలో చాలా మంది అభ్యర్థులు నష్టపోతుంటారు. అయితే వారికి ప్రిపరేషన్ లో సరైన వ్యూహం లేదని అనుకోవాలి. ఎందుకంటే సముద్రం లాంటి జనరల్ స్టడీస్ సిలబస్ లో కేవలం సాధారణ ప్రిపరేషన్ తో మంచి మార్కులు సాధించలేరు. సిలబస్ చాలా ఎక్కువగా ఉండటమే దీనికి కారణం.. మరి ఇంత వ్యాస్ట్ సిలబస్‌లో పట్టు సాధించాలంటే సరైన వ్యూహం తప్పనిసరి. సబ్జెక్టులతో పాటు జనరల్ స్టడీస్ కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే జనరల్ స్టడీస్ లో ఎక్కువ మార్కులు వచ్చే ముఖ్యమైన ఏరియాలను ముందుగా కవర్ చేసుకోవాలి. ప్రీవియస్ పేపర్లు, మోడల్ పేపర్లు బాగా ప్రాక్టీస్ చేయాలి. కనీసం రోజుకు ఒక జనరల్ స్టడీస్ పేపర్ అయినా ప్రాక్టీస్ చేయాలి. అందులో ఎంత స్కోరు వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఏ విభాగంలో స్కోరు చేయలేక పోయారనేది చూసుకోవాలి. ఆయా విభాగాలను మరోసారి రివిజన్ చేసుకుంటే..తదుపరి టెస్ట్ లో మీ స్కోరు పెరుగుతుంది. ఇలా ప్రతీ రోజు రివిజన్ చేసుకుంటూ ..మోడల్ పేపర్లను చేస్తూ ప్రిపరేషన్ కొనసాగిస్తే జనరల్ స్టడీస్‌లో బాగా పట్టు సాధించవచ్చు.
పోస్టుల వివరాలు (9231):
డిగ్రీ లెక్చరర్ పీడీ, లైబ్రేరియన్ - 868
జూనియర్ లెక్చరర్, లైబ్రేరియన్, పీడీ - 2008
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ) - 1276
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ) - 4020
లైబ్రేరియన్ స్కూల్ - 434
పీడీ ఇన్ స్కూల్ - 275
డ్రాయింగ్, ఆర్ట్ టీచర్లు - 134
క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్, క్రాఫ్ట్ టీచర్లు - 92
మ్యూజిక్ టీచర్లు - 124