- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సివిల్స్ మెయిన్స్ ఎగ్జామ్ తేదీలు విడుదల
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 మెయిన్స్ పరీక్షల తేదీలను విడుదల చేసింది. ఇంతకుముందు మే నెలలో ప్రాథమిక పరీక్షను నిర్వహించగా జూన్‌లో ఫలితాలను విడుదల చేశారు. ఇప్పుడు మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం మెయిన్స్ ఎగ్జామ్ సెప్టెంబర్ 15,16,17,23,24 తేదీల్లో జరుగుతుంది. మొత్తం 1105 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మెయిన్స్ 2023 పేపర్‌లను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 వరకు రెండు షిఫ్ట్‌లలో నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, విజయవాడ. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in నుండి హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోగలరు.
Advertisement
Next Story