- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత సైన్యంలో అగ్నివీర్ జనరల్ డ్యూటీ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల
దిశ, కెరీర్: భారత సైన్యానికి చెందిన చెన్నైలోని జోన్ రిక్రూటింగ్ ఆఫీస్.. అగ్నిపథ్ పథకం కింద 2023-24 ఏడాది నియామకాలకు సంబంధించి అగ్నివీర్ జనరల్ డ్యూటీ (మహిళా మిలిటరీ పోలీస్) ఎంపికల కోసం అవివాహిత మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఈ నియామకాలకు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరితోపాటు అండమాన్ నికోబార్, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
కేటగిరి: అగ్నివీర్ జనరల్ డ్యూటీ (మహిళా మిలిటరీ పోలీస్) పోస్టులు
వయసు: 17 1/2 నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి. అక్టోబర్ 1, 2002 నుంచి అక్టోబర్ 1, 2006 మధ్య జన్మించి ఉండాలి.
అర్హత: 45 శాతం మార్కులతో పదో తరగతి/మెట్రిక్యులేషన్, ప్రతి సబ్జెక్టులో 33 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. డ్రైవర్ నియామకాలకు లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. శారీరక ప్రమాణాలు ఉండాలి.
ఫిజికల్ మెజర్మెంట్స్: ఎత్తు 162 సెం.మీ, ఛాతీ గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ విస్తరించేలా ఉండాలి.
ఎంపిక: ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, రిక్రూట్మెంట్ ర్యాలీ (ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్), వైద్య పరీక్షలు,ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 16, 2023.
చివరి తేదీ: మార్చి 15, 2023.
పరీక్ష తేదీ: ఏప్రిల్ 17, 2023.
వెబ్సైట్: https://joinindianarmy.nic.in